IT Raids In Tollywood : మూడు రోజుల పాటు టాలీవుడ్‌ను ఐటీ రైడ్స్ ఊపేస్తున్నాయి. అటు దిల్ రాజు… ఇటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న (గురు వారం) రాత్రితో దాదాపు అన్ని చోట్ల సోదాలు ముగిశాయి. కానీ, దిల్ రాజు ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు లెక్కల గురించి పెద్దగా సమాచారం రాలేదు. కానీ, మైత్రీ గురించి మాత్రం ఇండస్ట్రీలో ఒకటి తెగ వైరల్ అవుతుంది. దీని ప్రకారం… పుష్ప 2 లెక్కల్లో తేడా వచ్చినట్టు తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
పుష్ప 2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్ చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు. రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల 1000 కోట్ల వచ్చాయని ప్రచారం సాగడంతో ఒక్క సారిగా… పుష్ప నిర్మాతలకు భారీ లాభాలు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. రిలీజ్ తర్వాత కలెక్షన్ల పోస్టర్ల వల్ల మరింత ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు పుష్ప 2 మూవీ నిర్మాతలపై సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సోదాల్లో లెక్కల్లో కాస్త తేడాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఐటీ అధికారుల కూడా ఈ లెక్కలు అన్నీ కన్ఫ్యూజ్‌గా ఉన్నాయని చెప్పారట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అయితే కన్ఫ్యూజన్ అనేది పుష్ప 2 మూవీని ర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌పైన కాదు.. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లెక్కల్లో తేడాలు కనిపించినట్టు తెలుస్తుంది.
దీంతో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లెక్కలను శశిధర్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. శశిధర్ రెడ్డి కోసం వాళ్ల మామకు చెందిన ఓ హోటల్ కి వెళ్లి మరీ ప్రశ్నించినట్టు సమాచారం.
ప్రష్ఫ 2 మూవీ కి వచ్చిన కలెక్షన్లు… చెల్లించని ఐటీ, జీఎస్‌టీకి సంబంధం లేకపోవడంతో పాటు లెక్కల్లో చాలా కన్ఫ్యూజ్ ఉందట. దీంతో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి పలు కీలక పాత్రలను ఐటీ అధికారులు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.