Indian Players: ఇటీవలి కాలంలో విడాకులు తీసుకునే క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కొందరు అధికారికంగా ప్రకటిస్తుంటే.. మరికొందరు మాత్రం వారి విడాకుల విషయాన్నీ అధికారికంగా చెప్పనప్పటికీ ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలలో భాగస్వామితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను తొలగిస్తూ విడాకుల రూమర్స్ కి ఓ హింట్ ఇస్తున్నారు. ఓవైపు యువ క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతుంటే.. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు, అలాగే మాజీ ఆటగాళ్లు విడాకులు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు.
Also Read: Rajkumar Rao: గంగూలీ బయోపిక్ వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే ?
ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రికెటర్ చేరాడు. ఇప్పటివరకు విడాకులు తీసుకున్న భారతీయ క్రికెటర్ల వివరాలు చూస్తే.. హార్దిక్ పాండ్యా – నటాషా, శిఖర్ ధావన్ – ఆయేషా ముఖర్జీ, దినేష్ కార్తీక్ – నిఖిత వంజర, మహమ్మద్ అజారుద్దీన్ – నౌరీన్, సంగీత, వినోద్ కాంబ్లీ – నోయెల్లా లూయిస్, రవి శాస్త్రి – రీతూ సింగ్, మహమ్మద్ షమీ – హాసిన్ జహాన్, మనోజ్ ప్రభాకర్ – సంధ్యా.. ఇలా పలువురు క్రికెటర్లు ఇప్పటికే విడాకులు తీసుకోగా.. గత కొంతకాలంగా యుజ్వేంద్ర చాహల్ – ధన శ్రీ వర్మ జంట కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
తాజాగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తన భార్య ఆర్తి అహ్లావత్ తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు, వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఇక విడాకులు ఖాయమేనని రూమర్స్ వెలువడుతున్నాయి. అయితే తాజాగా మరో క్రికెటర్ కూడా విడాకులకు సిద్ధమైనట్లు పలు రూమర్స్ వెలువడుతున్నాయి.
అతనెవరో కాదు మనీష్ పాండే. ఇతడి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తినట్లు సమాచారం. మనీష్ పాండే భార్య, కన్నడ నటి ఆశ్రితా శెట్టికి – మనీష్ పాండేకి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం కూడా వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ పెళ్ళి ఫోటోలను తొలగించడమే. ఉత్తరాఖండ్ కి చెందిన మనీష్ పాండే 2015లో భారత జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు.
Also Read: Rinku Singh: అదృష్టం అంటే ఇదే… రూ.500 కోట్ల ఆస్తులకు రింకూ అధిపతి ?
ఇక కన్నడలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆశ్రిత శెట్టిని ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నాడు మనిష్ పాండే. ఇప్పుడు మనీష్ పాండే విడాకులకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా టీమిండియాలో ఓ కల్లోలం మొదలైంది. ఒకేసారి ముగ్గురు ప్లేయర్లు విడాకులు తీసుకోబోతున్నారని, వీరేంద్ర సెహ్వాగ్, యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే.. ఇలా ఈ ముగ్గురు క్రికెటర్లకు సంబంధించిన విడాకుల వార్తలు ఇప్పుడు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ పై వీరు స్పందిస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాలి.
– Azharuddin – Divorced
– Kambli – Divorced
– Prabhakar – Divorced
– Sreenath – Divorced
– Shastri – Divorced
– Dhawan – Divorced
– Shami – Divorced
– Karthik – Divorced
– Pandya – Divorced
– Pandey – About to divorce
– Chahal – About to divorce
– Sehwag – About to divorce… pic.twitter.com/CJb4JuXftv— Vipin Tiwari (@Vipintiwari952) January 23, 2025