Sugar Side Effects: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. మనం తినే ఆహారం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అందుకే మనం తినే ఆక్హారంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ఇదిలా ఉండే వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి, చక్కెర, ఉప్పు. ఎక్కువగా చక్కెర తినే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో రుజువైంది. చక్కెరను స్లో పాయిజన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కాలక్రమేణా శరీరాన్ని ఖాళీ చేస్తుంది.
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. చక్కెర పానీయాలు, స్వీట్లు, తియ్యటి పాల ఉత్పత్తులు అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని తీవ్రమైన వ్యాధులకు గురి చేస్తాయి. చక్కెర వల్ల ఆరోగ్యానికి కలిగే హాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చక్కెర ఎక్కువగా తింటే ఏం జరుగుతుందంటే ?
చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది టైప్ -2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్ కేర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, తియ్యటి పానీయాలు లేదా అధిక మొత్తంలో చక్కెరను ప్రతిరోజు తీసుకునే వ్యక్తులు మధుమేహం అభివృద్ధి చెందే ప్రమాదం 26% పెరుగుతుందని కనుగొన్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక మొత్తంలో చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో అదనపు కేలరీలను పెంచడం ప్రారంభిస్తాయి. రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు పెరిగే ప్రమాదం:
అధిక చక్కెరను తీసుకోవడం వల్ల మధుమేహం పెరగడమే కాకుండా, ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఊబకాయం మధుమేహం , గుండె జబ్బులతో సహా అనేక ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది.
న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లోని ఒక నివేదిక ప్రకారం, చక్కెరను జోడించిన పానీయాలు ఊబకాయం ప్రమాదాన్ని 60% పెంచుతాయి. ఊబకాయంతో బాధపడేవారికి కాలక్రమేణా గుండె జబ్బులు, కాలేయ సమస్యలు మరియు కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. చక్కెర మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
కాలేయ వ్యాధి:
చక్కెర కలిపిన ఆహారాలలో పుష్కలంగా ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది కాలేయానికి హాని కలిగిస్తుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉండటం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఫ్రక్టోజ్ కాలేయంలో విచ్ఛిన్నమైనప్పుడు, అది కొవ్వుగా మారుతుంది. ఇది కాలక్రమేణా కాలేయంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోయే సమస్యను ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. ఇది కాలేయం యొక్క సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. చక్కెర మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
Also Read: నిద్ర సరిగ్గా లేకపోతే బరువు పెరుగుతారా ? పరిశోధనల్లో షాకింగ్ నిజాలు
దంత క్షయం:
చక్కెర దంతాలలో బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఇది కావిటీస్, క్షయానికి కారణమవుతుంది.
క్యాన్సర్ ప్రమాదం: ఊబకాయం, వాపు , అధిక చక్కెర క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
మానసిక ఆరోగ్యం: అధిక చక్కెర వినియోగం నిరాశ ,ఆందోళనను ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ: అధిక చక్కెర శరీరం యొక్క రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
మెదడుపై ప్రభావం: అధిక చక్కెర జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. ఏకాగ్రతలో ఇబ్బందికి దారితీస్తుంది.