BigTV English

Devara: సోషల్ మీడియాను షేక్ చేసిన చుట్టమల్లే వీడియో సాంగ్.. వచ్చేసింది

Devara: సోషల్ మీడియాను షేక్ చేసిన చుట్టమల్లే వీడియో సాంగ్.. వచ్చేసింది

Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం  ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 27 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. భారీ విజయం అని చెప్పలేం కానీ..  రాజమౌళి సినిమా తరువాత డిజాస్టర్ అనే సెంటిమెంట్ నుంచి ఎన్టీఆర్ ను బయటపడేసింది అని చెప్పొచ్చు. ఇక రికార్డ్ కలక్షన్స్ అందుకున్న ఈ చిత్రంలో  ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది.


దేవర సినిమా థియేటర్ లోకి వచ్చి నెల కావొస్తుంది. దీంతో న‌వంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలోని సాంగ్స్ వీడియోతో సహా రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆయుధ పూజ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా రొమాంటిక్ సాంగ్ చుట్టమల్లే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

Srikanth Iyenger : శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యలపై మంచు విష్ణుకు ఫిర్యాదు…


చుట్టమల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇందులో ఆ! అనే సౌండ్ వచ్చినప్పుడు.. ఆ సౌండ్ కూడా వినిపించకుండా  ప్రేక్షకులే కోరస్ పాడుతున్న వీడియోలు వైరల్ గా మారిన విషయం తెల్సిందే. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆ! అనడం సెన్సేషన్ సృష్టించింది. ఇక ఇప్పుడు  ఆ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయడంతో ఇంకోసారి ఆ! ఫ్యాన్స్ అసెంబుల్ అయ్యారు.

ఇక ఈ సాంగ్ గురించి చెప్పాలంటే.. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన అద్భుతమైన సాంగ్స్ లో ఇది కూడా ఒకటి. అనిరుధ్ మ్యూజిక్.. శిల్పారావు హస్కీ వాయిస్ చుట్టమల్లే సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. వీడియోలో జాన్వీ అందాలు వేరే లెవెల్ అని చెప్పాలి. వర మీద ప్రేమను, అతడిపై ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ ను తంగం ఈ సాంగ్ లో చెప్తూ ఉంటుంది.

Bigg Boss Telugu 8: అతన్నీ కలవడం కోసం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానన్న హాట్ బ్యూటీ..

ఇక నార్మల్ స్టెప్స్ అయినా కూడా ఎన్టీఆర్, జాన్వీ ఎంతో ఈజ్ గా చేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో  సాంగ్ నెట్టింట వైరల్ గా  మారింది. మరి థియేటర్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×