BigTV English

Devara : దేవర స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్… టికెట్ రేట్లు ఎంతంటే?

Devara : దేవర స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్… టికెట్ రేట్లు ఎంతంటే?

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండవ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రత్యేక షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇదే విషయం తెలుపుతూ నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు పేరు పేరునా థ్యాంక్స్ చెప్పారు. మరి దేవర స్పెషల్ షోలు ఎప్పుడు వేయబోతున్నారు? పెరిగిన టికెట్ ధరలు ఎంత? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్పెషల్ షోలకు అనుమతులు.. పెరిగిన టికెట్ ధరలు 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తున్న రెండవ మూవీ ఇది. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమా కోసం మేకర్స్ బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేశారు. అందుకే చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం సినిమా టికెట్ ధరలతో పాటు స్పెషల్ షోల విషయంలో అనుమతులు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. తాజాగా దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అదనంగా ఎంత మేరకు పెంచుకోవచ్చో తెలియజేస్తూ జీవోను జారీ చేసింది. దేవర రిలీజ్ రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత రోజు ఐదు షోలు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొమ్మిది రోజులు పాటు ఈ స్పెషల్ షోలు ఉండగా, టికెట్ల ధరలను సైతం పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఏపీలో సింగిల్ స్క్రీన్ లలో రూ . 163 నుంచి రూ. 248 వరకు టికెట్ ధరలు ఉండొచ్చు. అలాగే మల్టీప్లెక్స్ లలో రిక్లయినర్ రూ.450, జనరల్ రూ. 336 ఉండే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఇవే టికెట్ ధరలు కంటిన్యూ అవుతాయి. ఆ తరువాత టికెట్ రేట్లు తగ్గుముఖం పడతాయి.


Jr NTR's 'Devara: Part 1' trailer unveils this evening! | - Times of India

హీరో, నిర్మాత స్పెషల్ ట్వీట్స్

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్పెషల్ షోలకు అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసినందుకు, తెలుగు సినిమాకు సపోర్ట్ చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇదే విధంగా ట్వీట్ చేస్తూ తమకు సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరి దేవరకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×