BigTV English

Devara Movie: మరోసారి ‘దేవర’కు ‘ఆంధ్రావాలా’తో పోలిక.. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?

Devara Movie: మరోసారి ‘దేవర’కు ‘ఆంధ్రావాలా’తో పోలిక.. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?

Devara Movie: ఒక చిన్న కామన్ పాయింట్ కనిపించినా చాలు.. ఒక సినిమాను మరొక సినిమాతో పోల్చడానికి సిద్ధంగా ఉంటారు ప్రేక్షకులు. అలాంటి సెంటిమెంట్స్ ఫ్యాన్స్‌లో మరీ ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఎన్‌టీఆర్ అప్‌కమింగ్ మూవీ ‘దేవర’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమాను 2004లో విడుదలయిన ‘ఆంధ్రావాలా’తో పోలుస్తున్నారు కొందరు ప్రేక్షకులు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇలా పోల్చడంలో తప్పు లేదని మరికొందరు నెటిజన్లు సైతం ఫీలవుతున్నారు. అసలు ఇలా పోల్చడానికి కారణాలు ఏంటని అనుకుంటున్నారా?


మొదట్లో ట్రోల్స్

‘దేవర’లో ఎన్‌టీఆర్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడనే విషయం పోస్టర్లతోనే డౌట్ వచ్చేలా చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఆ తర్వాత మొదటి ట్రైలర్ విడుదలవ్వగానే ఆ విషయం కన్ఫర్మ్ అయ్యింది. దీంతో అప్పటినుండే ‘దేవర’ను ‘ఆంధ్రావాలా’తో పోల్చడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఎందుకంటే ‘ఆంధ్రావాలా’లో తండ్రిగా తనే, కొడుకుగా తనే నటించి అలరించాడు ఎన్‌టీఆర్. ‘దేవర’లో కూడా అదే అని మొదటి ట్రైలర్‌తోనే కన్ఫర్మ్ అయ్యింది. పైగా ‘ఆంధ్రావాలా’ ట్రైలర్ విడుదలయినప్పుడు కూడా మొదట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. అలాగే ‘దేవర’ ట్రైలర్ కూడా ఊహించినంత లేదంటూ ట్రోల్సే వినిపించాయి.


Also Read: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాస్.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్?

అదొక సంచలనం

‘దేవర’కు సంబంధించిన సెకండ్ ట్రైలర్ కూడా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో మరోసారి ‘ఆంధ్రావాలా’ పేరే తెరపైకి వచ్చింది. ఈ రెండు సినిమాలను పోల్చడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు.. వీటిపై ఎడిట్స్ కూడా మొదలుపెట్టారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ‘ఆంధ్రావాలా’ ఈవెంట్ కోసం ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు అనే విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు, ప్రేక్షకులు, ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు, అంత సంచలనం సృష్టించింది. ఇన్నాళ్ల తర్వాత ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఆఖరికి ఫ్యాన్స్ వల్ల ఈవెంట్ క్యాన్సెల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ‘దేవర’ సినిమాను ‘ఆంధ్రావాలా’తో పోల్చడంలో ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. కానీ రిజల్ట్ కూడా అలాగే ఉంటే ఏంటి పరిస్థితి అని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

ఆ సెంటిమెంట్ కూడా

అప్పట్లో ‘ఆంధ్రావాలా’కు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఆ హైప్ అందుకోలేక సినిమా డిశాస్టర్ అయ్యింది. ‘దేవర’కు కూడా అలాంటి రిజల్టే వస్తే మూడేళ్ల నుండి ఫ్యాన్స్ ఎదురుచూపులకు అర్థం ఉండదు. అంతే కాకుండా టాలీవుడ్‌లోని ప్రతీ ప్రేక్షకుడికి మరొక సెంటిమెంట్ కూడా ఉంది. రాజమౌళితో కలిసి సినిమా చేసిన హీరోలు ఎవ్వరికీ ఆ తర్వాత మూవీ హిట్ అయినట్టు దాఖలాలే లేవు. అందుకే ‘దేవర’ విషయంలో ‘ఆంధ్రావాలా’ సెంటిమెంట్, రాజమౌళి సెంటిమెంట్.. ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. కానీ ‘దేవర’ రిజల్ట్ హిట్టే అని గట్టిగా నమ్ముతున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ‘ఆచార్య’ ఫెయిల్ అయినా కూడా కొరటాల శివ మీద నమ్మకం ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు ప్రేక్షకులు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×