BigTV English

Devara Movie: నార్త్ అమెరికాలో దుమ్మురేపుతున్న ‘దేవర’.. కొత్త రికార్డ్స్ సెట్ చేస్తోందిగా!

Devara Movie: నార్త్ అమెరికాలో దుమ్మురేపుతున్న ‘దేవర’.. కొత్త రికార్డ్స్ సెట్ చేస్తోందిగా!

Devara Movie Pre Booking Sales: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ క్రేజ్ అందుకోలేనంతగా పెరిగిపోయింది. పైగా ఈ హీరోను అభిమానులు స్క్రీన్‌పై చూసి కూడా మూడేళ్లు దాటిపోయింది. దీంతో ‘దేవర’ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు మామూలుగా లేవు. ఫైనల్‌గా ఇంకా కొన్నిరోజుల్లోనే ఎన్‌టీఆర్ ఊర మాస్ యాక్షన్‌ను తెరపై చూడనున్నారు ప్రేక్షకులు. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రీ బుకింగ్స్‌ను ఓపెన్ అయ్యాయి. ఇక ఇండియాలో ప్రీ బుకింగ్ సేల్స్ ఒక రేంజ్‌లో దూసుకుపోతుండడం విశేషం అనుకుంటే.. నార్త్ అమెరికాలో ‘దేవర’కు జరుగుతున్న ప్రీ బుకింగ్స్ ఇండస్ట్రీ నిపుణులను అశ్చర్యపరుస్తున్నాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ.


ప్రీ బుకింగ్ సేల్స్ అదుర్స్

అమెరికాలో పలువురు తెలుగు హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చాలామంది తెలుగు హీరోలకు ఓవర్సీస్‌లో కలెక్షన్ రికార్డులు ఉన్నాయి. ఇక ఈమధ్య మేకర్స్ ఫోకస్ అంతా నార్త్ అమెరికాపైనే ఉంది. ఏ తెలుగు సినిమా విడుదలయినా కూడా నార్త్ అమెరికా నుండే ఎక్కువ కలెక్షన్స్ రావడం మొదలయ్యింది. ఇప్పుడు ‘దేవర’ విషయంలో కూడా అదే జరుగుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కేవలం అక్కడ మాత్రమే 2 మిలియన్ డాలర్ల ప్రీ బుకింగ్ సేల్స్ జరిగాయనే విషయం బయటికొచ్చింది. దీంతో ‘దేవర’ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త రికార్డులను సెట్ చేయడానికి సిద్ధమవుతోందని ప్రేక్షకులు అంటున్నారు.


Also Read: తెరుచుకున్న దేవర టికెట్ బుకింగ్స్.. ఎగబడుతున్న ఫ్యాన్స్..!

మొదటి హీరో

కేవలం నార్త్ అమెరికాలోనే 2 మిలియన్ డాలర్ల ప్రీ బుకింగ్ సేల్స్ సంపాదించుకున్న ఇండియన్ హీరోల్లో ఎన్‌టీఆర్ మొదటివాడుగా నిలిచాడు. దీంతో ఫ్యాన్స్ మరింత హ్యాపీ ఫీలవుతున్నారు. మూడేళ్ల తర్వాత ‘దేవర’తో రావడానికి సిద్ధమయినా ఈ మూవీ విడుదల అవ్వకముందే బ్యాక్ టు బ్యాక్ రికార్డులు దక్కడానికి ఎన్‌టీఆరే కారణమని అంటున్నారు. ప్రీ బుకింగే ఈ విధంగా జరగడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో కూడా ‘దేవర’ ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని నమ్మకంతో ఉన్నారు. అమెరికాలో ఈ మూవీ క్రేజ్ చూసి మూవీ టీమ్ అంతా అక్కడి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

కెమిస్ట్రీ హైలెట్

కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమయ్యింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్‌ను అసలు స్క్రీన్‌పై చూడలేదు ప్రేక్షకులు. దాంతో పాటు ఈ సినిమా పలుమార్లు పోస్ట్‌పోన్ కూడా అయ్యింది. మొత్తానికి ఇంతకాలం ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫలితం దక్కనుంది. మూవీ టీమ్ అంతా ‘దేవర’ హిట్‌పై నమ్మకంతో ఉన్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. ఇప్పటికే సౌత్ ఇండియన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కోసం తమిళ, తెలుగులో స్పీచ్‌లు కూడా రెడీ చేసుకుంది జాన్వీ. ‘దేవర’లో జాన్వీ, ఎన్‌టీఆర్ కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యేలా ఉందని ఇప్పటివరకు విడుదలయిన పాటలు చూస్తే అర్థమవుతోంది.

Devara
Devara

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×