BigTV English

Janhvi Kapoor – Jr Ntr: ఎన్టీఆర్‌ ఎనర్జీపై జాన్వీ ప్రశంసలు.. నాకు 10 రోజులు.. తారక్‌కు ఒక్క సెకన్ అంటూ

Janhvi Kapoor – Jr Ntr: ఎన్టీఆర్‌ ఎనర్జీపై జాన్వీ ప్రశంసలు.. నాకు 10 రోజులు.. తారక్‌కు ఒక్క సెకన్ అంటూ

Devara Movie Janhvi Kapoor Praised Jr Ntr: బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అందాల నటి శ్రీదేవి, బడా నిర్మాత బోనీ కపూర్ దంపతుల కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రెజెంట్ తెలుగులో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ఆర్సీ 15’, మరొకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ దేవర షూటింగ్‌లో పాల్గొంటుంది.


అయితే అందాల భామ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో నటించిన ఒక సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఆమె నటించిన ‘ఉలజ్’ మూవీ ఆగస్టు 2న రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. ఇందులో భాగంగా జాన్వీ ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ మేరకు తాను తెలుగులో నటిస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ‘దేవర’ మూవీ యూనిట్, హీరో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

Also Read: హాస్పిటల్ లో జాన్వీ కపూర్.. ఆందోళనలో ఫ్యాన్స్


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో నటించడం చాలా ఆనందంగా ఉందని.. వారు కళను, సినిమాను చాలా ఎక్కువగా గౌరవిస్తారని చెప్పింది. అంతేకాకుండా ఇతరులతో కూడా హుందాగా ప్రవర్తిస్తారని.. ఎక్కువగా కథపై నమ్మకంతో వర్క్ చేస్తారని కొనియాడింది. అలాగే డైరెక్టర్ కొరటాల శివ సెట్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారని.. ఏ విషయాన్ని అయినా చాలా సున్నితంగా చెప్తారని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలిపింది. ఆపై ఎన్టీఆర్‌ గురించి చెప్తూ.. దేవరలో తాను ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తుండటం చాలా ఆనందంగా భావిస్తున్నానని తెలిపింది. ఆయనొక ఎనర్జిటిక్ హీరో అని.. ఆయన సెట్‌కి రాగానే అందరిలోనూ ఉత్సాహం పెరుగుతుందని చెప్పింది.

ఆయన రాగానే సెట్‌కి ఏదో తెలియని కళ వస్తుందని ప్రశంసించింది. ఇటీవల తమ ఇద్దరి మధ్య ఒక సాంగ్ షూట్ చేశారని.. ఆ సాంగ్‌లో ఎన్టీఆర్ ఎనర్జీ చూసి షాక్ అయ్యానని తెలిపింది. ఎన్టీఆర్ చాలా స్పీడ్‌గా ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేయగలరని పేర్కొంది. ఏ విషయాన్ని అయినా ఎన్టీఆర్ ఒక్క సెకన్‌లో నేర్చుకుంటారని.. అదే తనకైతే 10 రోజులు పడుతుందని నవ్వుతూ చెప్పింది. ఇప్పుడు తాను సెకండ్ సాంగ్‌ కోసం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×