Devara Movie Update : సాగర తీరం ..సంధ్యారాగం..అంటున్న జాన్వీ.. ఎన్టీఆర్.

Devara Movie Update : సాగర తీరం .. సంధ్యారాగం.. అంటున్న జాన్వీ.. ఎన్టీఆర్.

Devara Movie Update
Share this post with your friends

Devara Movie Update : సాగర తీరం ..సంధ్యారాగం..అంటున్న జాన్వీ.. ఎన్టీఆర్.ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవర కోసం అతను అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తిరిగి ఎన్టీఆర్ నుంచి చాలా లాంగ్ గాప్ తర్వాత రాబోతున్న చిత్రం కావడం తో ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ లో శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సెరవేగంతో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ మూవీకి సంబంధించి కొన్ని సముద్రం మీద ఫైట్ సీన్స్.. సముద్ర తీర నేపథ్యంలో సాగే సీన్స్ షూటింగ్ ఇటీవలే గోవాలో జరిగింది. ఇప్పటికే మూవీలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ మధ్య భారీ ఫైట్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ కు థియేటర్ దద్దరిల్లాల్సిందే అని టాక్. ఈ మూవీ లో ఎన్టీఆర్‌.. వేలాది మంది డ్యాన్సర్స్ మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఎన్టీఆర్ డాన్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సాంగ్ ఎన్టీఆర్ ను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది అని టాక్.

ఇదిలా ఉండగా ఇప్పుడు దేవర మూవీ లో ఎన్టీఆర్, జాన్వి కపూర్ మధ్య ఒక మంచి హై రొమాంటిక్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది అని ఇన్‌సైడ్ బజ్. పైగా రొమాంటిక్ బీచ్ సీక్వెన్స్ తో సాగే ఈ పాటలో ఎన్టీఆర్,జాన్వి ఇద్దరూ మత్స్యకారుల ట్రెడిషనల్ గెటప్ లో ఉంటారట. అంతే కాదు ఈ సాంగ్ లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా పీక్స్ లో ఉంటుంది అని తెలుస్తుంది. ఈ సాంగ్ లో కొరటాల శివ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ అందాన్ని మరింత హై లైట్ చేసే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. 

దేవర మూవీ మత్స్యకారుల జీవిత నేపథ్యంలో సాగే చిత్రమని తెలిసిందే. ఎన్టీఆర్ మత్స్యకారుడుగా ఎలా ఉంటాడో చూడాలని అతని అభిమానుల ఆశ పడుతున్నారు. ఈ మూవీ కి మ్యూజిక్ అందిస్తున్నది అనిరుధ్ రవిచందర్. అనిరుద్ మ్యూజిక్ లో మాజిక్ కి ఎన్టీఆర్ స్టెప్స్.. ఆ క్రేజీ కాంబో తలచుకుంటేనే గూస్ బంప్స్ కలుగుతాయి. దేవర చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో మొదటి భాగం – ఏప్రిల్ 5, 2024న  హాట్ సమ్మర్ కూల్ ట్రీట్ గా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Kavitha : కవితకు సీబీఐ మరోసారి నోటీసులు.. మళ్లీ ప్రశ్నించేందుకు సన్నద్ధం..

BigTv Desk

Telangana : తెలంగాణకు జాతీయ అవార్డుల పంట.. రాష్ట్రం దేశానికే ఆదర్శం: కేసీఆర్

Bigtv Digital

Modi : ఆ దేశంలోని నేతలను చూసి నేర్చుకోండి.. విపక్షాలకు మోదీ కౌంటర్..

Bigtv Digital

Kaleswaram Project : మేడిగడ్డ అందుకే కుంగిందా ? NDSA సంచలన రిపోర్ట్..

Bigtv Digital

Preethi : విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. సరైన వైద్యం అందడంలేదని తండ్రి ఆవేదన..

Bigtv Digital

NTR 30 Rumors : NTR 30 రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ.. స్టార్ టెక్నీషియన్స్ రంగంలోకి

BigTv Desk

Leave a Comment