Devara 3 Days Collections: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఆస్కార్ ను అందుకోవడంతో ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. ఇక ఇన్నాళ్లకు ఎన్టీఆర్ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం దేవర.. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు రోజులుగా అయినా సినిమాకు క్రేజ్ తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు ఫ్రీ బుకింగ్స్ భారీగా జరిగాయి. థియేటర్లలోకి వచ్చిన తర్వాత రెండు రోజులు భారీ వసూల్ చేసింది. ఇక మూడు రోజులకు గానీ కలెక్షన్స్ పెరిగాయా తగ్గాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన రెండో మూవీ దేవర కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. జనతా గ్యారేజ్ సినిమా గతంలో మంచి విజయాన్ని అందుకుంది. దేవర సినిమా అంచనాలకు తగ్గట్లే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి షోతోనే బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకున్నది. భారీ యాక్షన్ సీన్స్ ఉండటం వల్ల సినిమాకు నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది. మొదటి రోజు ఏకంగా రూ. 172 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ. 243 ప్లస్ గ్రాస్ రాబట్టిందని దేవర టీమ్ అధికారికంగా ప్రకటించారు. ఇక మూడో రోజు సండే కావడంతో కలెక్షన్స్ ఇంకాస్త పెరిగినట్లు తెలుస్తుంది. సండే గాను మరో రూ. 40 కోట్లకు పైగా రాబట్టిందని సమాచారం..
ఇక దేవర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 1900 షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల షేర్ గ్రాస్ వసూళ్ల ను రాబట్టింది. ఇండియా వైడ్‌గా 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్సుగా నమోదు చేసింది. దేవర సినిమాకు ఇండియా మొత్తం కలిపి రూ. 30 కోట్లు రాబట్టిందని టాక్. మొత్తంగా వరల్డ్ వైడ్ కలిపి రూ. 30 కోట్ల వరకు రాబట్టిందని సమాచారం రెండో రోజు అన్ని ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. రూ. 243 కోట్లు వసూల్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇక మూడో రోజుకు గాను మరో 45 కోట్లు పెరిగినట్లు తెలుస్తుంది. అంటే మొత్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసిందని టాక్.. మూడో రోజు కలెక్షన్స్ ఎంత అనేది దేవర టీమ్ ప్రకటించాల్సి ఉంది.. దేవర హిట్ తో ఎన్టీఆర్, కొరటాల శివ రేంజ్ అయితే భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉన్నారు. తాజాగా దేవర కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించారు. మూడు రోజులకు గాను రూ. 304 కోట్లు రాబట్టినట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఇక ఇప్పటిలో ఈ సినిమాకు పోటీగా మరో సినిమా లేదు. దాంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కల్కి రికార్డులను త్వరలోనే అందుకుంటుందేమో చూడాలి..