Devara: టాలీవుడ్ ప్రమోషన్స్ నందు రాజమౌళి ప్రమోషన్స్ వేరయా.. ఈ మాట ఎవరిని అడిగినా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. జక్కన్న ప్రమోషన్ స్ట్రాటజీ ముందు ఎవరు పనికిరారు అని. బాలీవుడ్ లో మొదలుపెట్టి.. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అసలు సిసలైన పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ చేయాలంటే జక్కన్న తరువాతే ఎవరైనా. అయితే ఇప్పుడు ఆ జక్కన్న ప్రమోషన్స్ నే మరిపిస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఎన్టీఆర్.. రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీని వాడేశాడు.
Actor Vijay: వరుస ప్లాపులు.. చివరి సినిమాకు అన్ని కోట్లు ఎలా అన్నా.. ?
దేవర ట్రైలర్ ముంబైలో లాంచ్ చేసిన దగ్గరనుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. అటు బాలీవుడ్ ను.. ఇటు టాలీవుడ్ ను వదలకుండా రెండు సమానంగా బ్యాలన్స్ చేస్తూ ప్రమోషన్స్ షురూ చేశాడు, ముంబైలో ది కపిల్ శర్మ షో లో దేవర టీమ్ సందడి చేసింది. ఇది కాకుండా అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ఈరోజు రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఒకపక్క హిందీలో ఇంటర్వ్యూలను ముగించి హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్.. అసలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కుర్ర హీరోలతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు.
ఎన్టీఆర్ వీరాభిమాని అయినా హీరో విశ్వక్ సేన్, ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ కలిసి.. ఎన్టీఆర్, కొరటాల ను ఇంటర్వ్యూ చేసారు . ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయిట. అసలు తారక్.. ఒక హీరోతో ఫ్రేమ్ లో కనిపించడమే విశేషం అంటే.. ఇద్దరు కుర్ర హీరోలు.. తారక్ ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే.. అభిమానులు బట్టలు చింపేసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో ఈ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.
Amyra Dastur: ప్రిన్సెస్‌లా ముస్తాబైన అమైరా దస్తూర్.. అందాల విందు
ఇక ఇవే కాకుండా ఈ మధ్యనే కర్ణాటకలోని ఒక ఆలయాన్నికి వెళ్లి అక్కడ కూడా దేవర ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి రంగం సిద్ధం చేసి వచ్చాడు తారక్. ఇలా దేవర కోసం తారక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. నిజం చెప్పాలంటే దేవర సినిమా కోసం ఎన్టీఆర్ , కొరటాల ఎన్ని ఆశలు అయితే పెట్టుకున్నారో.. అంతకు వెయ్యిరెట్లు ఫ్యాన్స్ పెట్టుకున్నారు. రాజమౌళి సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా లేదా అని ఫ్యాన్స్.. ఆచార్య తరువాత కొరటాల దేవర సినిమాతో ఫామ్ లోకి వస్తాడా లేదా అని ఇండస్ట్రీ ఎంతగానో ఎదురుచూస్తుంది. అసలే దేవర ట్రైలర్ నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేదానిపై సోషల్ మీడియాలో రోజు చర్చలు సాగుతున్నాయి. మరి ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే.