EPAPER

NTR: అలియా, కరణ్ జోహార్‌లను నమ్ముకున్న ఎన్టీఆర్.. ఇక ‘దేవర’ను లేపే బాధ్యత వాళ్లదే!

NTR: అలియా, కరణ్ జోహార్‌లను నమ్ముకున్న ఎన్టీఆర్.. ఇక ‘దేవర’ను లేపే బాధ్యత వాళ్లదే!

NTR – Alia Bhatt: రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన సినిమా ఇది. ఆ మూవీ అటు ఎన్‌టీఆర్, ఇటు రామ్ చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా నటించిన ఆలియా భట్ కూడా తన డెబ్యూతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ కాంబో మరోసారి కలిసింది. కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ఆలియా భట్, ఎన్‌టీఆర్ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.


ప్రమోషన్స్ మొదలు

‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఆ తర్వాత తను చేసే ప్రాజెక్ట్స్‌పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు ఎన్‌టీఆర్. ఆ మూవీ విడుదలయిన తర్వాత నుండి కొరటాల శివతో చేస్తున్న ‘దేవర’తోనే బిజీ అయ్యాడు. ‘దేవర’ కూడా ఇతర ప్యాన్ ఇండియా చిత్రాల్లాగానే రెండు భాగాలుగా విడుదల కానుందని, అంతే కాకుండా ఇందులో ఎన్‌టీఆర్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడని దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సెప్టెంబర్ 27న విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో ‘దేవర’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఆ ప్రమోషన్స్ సమయంలోనే ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఎన్‌టీఆర్.


Also Read: ఈవారం సినిమాల సందడి – థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీలో కూడా ఎంటర్‌టైన్మెంట్ ఫుల్

మరింత హైప్

అసలైతే ‘దేవర’ మూవీ 2024 సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. పలు కారణాల వల్ల అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ ఎవరూ ఊహించని విధంగా సెప్టెంబర్‌కు మూవీని ప్రీపోన్ చేశారు మేకర్స్. ఫైనల్‌గా సెప్టెంబర్ 27న ఈ మూవీ విడుదల అవుతుందని ప్రకటించారు. దీంతో ముందుగా పాటలు విడుదల చేయడంతో సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇక సెప్టెంబర్ 10న ట్రైలర్ విడుదల అవుతుందని ప్రకటించి ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవర’ ప్రమోషన్స్ కోసం ఎన్‌టీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. అందుకే కరణ్ జోహార్‌, ఆలియా భట్‌తో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

వారి సినిమాల కోసం

ప్రస్తుతం ఆలియా భట్ కూడా బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తను ‘జిగ్రా’ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలవ్వగా అందులో ఆలియా భట్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అక్టోబర్ 11న ‘జిగ్రా’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అందుకే ‘దేవర’ కోసం ఎన్‌టీఆర్, ‘జిగ్రా’ కోసం ఆలియా భట్.. కలిసి ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేశారు. మధ్యలో కరణ్ జోహార్.. వీరిద్దరి స్పెషల్ ఇంటర్వ్యూను హోస్ట్ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ ఇంకా రిలీజ్ అవ్వకపోయినా దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కాంబో మళ్లీ రిపీట్ అయితే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెడుతున్నారు.

Related News

Ka Movie collections : అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. బాక్సాఫీస్ ను దున్నెస్తున్న ‘క ‘ మూవీ..

Lucky Bhaskar Day 3 Collections: బాక్సాఫీస్ వద్ద ‘లక్కీ భాస్కర్ ‘ జోరు.. రికార్డులు బ్రేక్ చేసే కలెక్షన్స్..?

Amaran Collections : బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్న’ అమరన్ ‘ కలెక్షన్స్.. మూడు రోజులకు ఎన్ని కోట్లంటే?

Venky Atluri: నేను ఒక కథ రాస్తున్నప్పుడు ఆ జోనర్ కి సంబంధించిన 30,40 సినిమాలు చూస్తాను

Varun Tej : తొలిప్రేమ’ టైటిల్ వాడినందుకే వణికాను.. ఇక చిరంజీవిగారి టైటిల్ వాడాలంటే?

Varun Tej: నేను కేవలం మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను, అంతకుమించి బ్రెయిన్ వాడను కూడా

Kollywood: సెలబ్రిటీ డాగ్ ని బలి తీసుకున్న దీపావళి సెలబ్రేషన్స్… సినిమాలో జరిగినట్టే…!

Big Stories

×