Jr. NTR’s Devara First Song Promo Released: దేవర.. దేవర.. దేవర.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసాయి.
ఎప్పుడెప్పుడు దేవర ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్ని బావుండి ఉంటే ఈపాటికి దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటేది. కొన్ని కారణాల వలన ఈ సినిమా అక్టోబర్ కు వాయిదా పడింది. అయినా దేవర మీద ఉన్న హైప్ ఇంచ్ కూడా తగ్గలేదు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడేలోపు.. సినిమాపై అంచనాలను పెంచడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా దేవర మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
ఫియర్ అంటూ సాగే సాంగ్ ను మే 19 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక నేడు ఈ సినిమా ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆల్ హైల్ ది టైగర్ అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుధ్ అదరగొట్టేశాడు. సముద్రం మధ్యలో పడవపై ఎన్టీఆర్ సీరియస్ లుక్ లో వస్తున్న విజువల్స్ కు అయితే గూస్ బంప్స్ గ్యారెంటీ. ఇక అనిరుధ్ ప్రతి సాంగ్ లో లానే ఈ సాంగ్ లో కూడా ఆయనే ఎక్కువ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈఒక్క ప్రోమోతోనే సాంగ్ పై అంచనాలు ఆకాశానికి తాకాయి. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.
Also Read: Naga Babu Twitter Account: మళ్లీ ట్విట్టర్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఈ సారి ఏమని ట్వీట్ చేశారంటే..?
#FearSong from May 19th… #Devara pic.twitter.com/Tdu6dgjn6Q
— Jr NTR (@tarak9999) May 17, 2024