Indian Railways: భారతీయ రైల్వే సంస్థ చత్తీస్ గఢ్ లో 9 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. బిలాస్ పూర్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ సంస్థ.. రైల్వే ట్రాక్ కు సంబంధించిన విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఇబ్బంది కలగకుండా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్ పూర్ డివిజన్ హత్‌బంద్-టిల్డా నియోరా విభాగంలో రహదారి అండర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఈ పనులను పూర్తి చేసేందుకు సుమారు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రయాణీకులకు ముందస్తు సమాచారంగా రైళ్ల రద్దుని ప్రకటించారు రైల్వే అధికారు.
రైళ్లు రద్దు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?
అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు రోజుల పాటు రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. నవంబర్ 15న మొదలు కొని 17 వరకు ఈ నిర్మాణ పనులు కొనసాగుతాయని తెలిపారు. ఈ పనుల కారణంగా రాయ్ పూర్- బిలాస్ పూర్ మధ్య నడిచే 9 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లను వేర్వేరు రోజుల్లో రద్దు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ముందస్తుగా వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో పలు చోట్ల చాలా కాలం క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. ఇరుకుగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే వాటిని విస్తరించాలని రైల్వే అధికారులు ప్రణాళికలు రెడీ చేశారు. ఇప్పుడు వాటిని విస్తరిస్తున్నారు. అండర్ పాస్ బ్రిడ్జిల విస్తరణ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణీకులకు మరింత సమర్ధవంతంగా రైల్వే సేవలు అందిస్తామన్నారు అధికారులు.
Read Also: రైలు కూతలో ఇన్ని రకాలున్నాయా? ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
మూడు రోజుల్లో రద్దయ్యే 9 రైళ్ల వివరాలు..
⦿ నవంబర్ 15: 08728 రాయ్ పూర్- బిలాస్ పూర్ MEMU క్యాన్సిల్ అవుతుంది.
⦿ నవంబర్ 15: 08733, 08734 బిలాస్ పూర్- గెవ్రా రోడ్ -బిలాస్‌పూర్ MEMU రద్దు అవుతుంది.
⦿ నవంబర్ 15, 16: 08719 బిలాస్ పూర్- రాయ్ పూర్ MEMU రద్దు అవుతుంది.
⦿ నవంబర్ 16: 08727 బిలాస్ పూర్- రాయ్ పూర్ MEMU రద్దు చేయనున్నారు.
⦿ నవంబర్ 17న, 08261 బిలాస్ పూర్- రాయ్ పూర్ ప్యాసింజర్ రద్దు చేశారు.
⦿ నవంబర్ 17: 08275 రాయ్ పూర్- జునాగర్ రోడ్ ప్యాసింజర్ రద్దు అవుతుంది.
⦿ నవంబర్ 18: 08276 జునాగర్- రాయ్ పూర్ రోడ్ ప్యాసింజర్ రద్దు చేయబడుతుంది.
⦿ నవంబర్ 18: 08280 రాయ్ పూర్- కోర్బా ప్యాసింజర్ రద్దు చేయబడుతుంది.
ఈ మూడు రోజుల పాటు బిలాస్ పూర్- రాయ్ పూర్ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులు, ముఖ్యంగా ప్రతి రోజూ రైలులో ప్రయాణించే వృత్తి నిపుణులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: భారత్ లో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఇదే! కానీ, ఇక్కడ రైలు ఆగదు ఎందుకో తెలుసా?