Ishan kishan: సౌదీ అరేబియాలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన మెగా వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా వేలంలో… హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాటింగ్లో బలంగా ఉన్న హైదరాబాద్ జట్టులోకి ( Sunrisers Hyderabad ) బౌలర్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: David Warner unsold: డేవిడ్ వార్నర్, పడిక్కల్ Un Sold
Also Read: Mohammad Siraj: తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్.. ఏకంగా 12.25 కోట్లు
అలాగే.. టీమిండియా కు సంబంధించిన ఒక బలమైన వికెట్ కీపర్ ఇప్పటివరకు హైదరాబాద్కు ( Sunrisers Hyderabad ) దక్కలేదు. అందుకే మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ కు ఆడిన ఇషాన్ కిషన్ ను…కొనుగోలు చేసింది హైదరాబాద్ జట్టు. అతనికి 11.25 కోట్లు… వేలం పాట పాడి మరి కొనుగోలు చేశారు. గతంలో 15.26 కోట్లు పలికిన ఇషాన్ కిషన్… ఈసారి మాత్రం 11.25 కోట్లకు తగ్గాడు.
Also Read: Kl Rahul: ఢిల్లీ జట్టులోకి కేఎల్ రాహుల్..గతంలో కంటే రూ.3 కోట్లు డౌన్ ?
అంటే అతని ఐపీఎల్ జీతం 26% తగ్గిపోయింది. ఇటీవల కాలంలో ఫామ్ లేక సతమతమవుతున్నాడు ఇషాన్ కిషన్. అందుకే అతన్ని ఆర్టియం కార్డు వాడి కొనుగోలు చేయలేదు ముంబై ఇండియన్స్. దీంతో కావ్య పాప అతన్ని ఎగిరేసుకుపోయింది. ఏదైతేనేం ఇషాన్ కిషన్ చాలా డేంజర్ బ్యాటర్. టి20 క్రికెట్ కు… సరిపడా ప్లేయర్. అతను గ్రౌండ్లో కాలు పెట్టడం అంటే సిక్స్ లు ఫోర్ లే. అందుకే అతన్ని హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) కొనుగోలు చేసింది.
Also Read: Mohammed Shami: SRH లోకి మహమ్మద్ షమీ.. ఎన్ని కోట్లు అంటే?
ఇది ఇలా ఉండగా…. హైదరాబాద్ జట్టు… ఇప్పటి వరకు కీలక ప్లేయర్లని కొనుగోలు చేసింది. అందులో మహమ్మద్ షమీ కూడా ఉండడం గమనార్హం. గుజరాత్ కు ఆడిన మహమ్మద్ సమీ… ఈసారి హైదరాబాదుకు ఆడబోతున్నాడు. అతని 10 కోట్ల వరకు పెట్టి కొనుగోలు చేసింది హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు యాజమాన్యం ( Sunrisers Hyderabad ). అంతేకాకుండా.. అడమ్ జంపాను కూడా కొనుగోలు చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్పిన్నర్… అద్భుతంగా బౌలింగ్ చేసే సత్తా ఉన్నవాడు. అందుకే వెంటనే ఆడం జంపాను కొనుగోలు చేసింది హైదరాబాద్ యాజమాన్యం ( Sunrisers Hyderabad ).
అదే సమయంలో… మొన్నటి వరకు పంజాబ్ కు ఆడిన… రాహుల్ చాహర్ కూడా కొనుగోలు చేశారు. స్పిన్ విభాగంలో బలంగా ఉండేందుకు… కావ్య పాప ఇలా… ముందుకు వెళ్లారు. ఆడం జంప అలాగే రాహుల్ చాహర్… ఇద్దరు ఇప్పుడు… స్పిన్ విభాగంలో రాణించగలుగుతారు. డబ్బులు తక్కువగా ఉన్న నేపథ్యంలో… కొంత మంది కీలక ప్లేయర్లను కూడా కొనలేకపోయింది హైదరాబాద్ ( Sunrisers Hyderabad ).