BigTV English

Pushpa Kissik Song :సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది

Pushpa Kissik Song :సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది

Pushpa Kissik Song: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప 2 ఒకటి. ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా ఏ స్థాయి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత అదే స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన సినిమా పుష్ప. సినిమాలో డైలాగ్ మాదిరిగానే తగ్గేదేలే అన్నట్లు సినిమా రేంజ్ కూడా తగ్గకుండా ప్రపంచవ్యాప్తంగా పాకింది. చాలామంది స్పోర్ట్స్ మేన్స్, పొలిటికల్ లీడర్స్ వీరంతా కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ మేనరిజం విపరీతంగా అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప టు సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ఈవెంట్ ను చెన్నై లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి రీసెంట్ గా కిస్సిక్ అనే ఐటెం సాంగ్ రిలీజ్ చేసారు.


పుష్ప సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుకుమార్ చేసిన అన్ని సినిమాలకు కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మామూలుగా సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఎంత ప్రత్యేకత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య సినిమా నుంచి మొదలు పెడితే రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా వరకు కూడా ప్రతి ప్రతి ఐటెం సాంగ్ కు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. వాస్తవానికి ఐటెం సాంగ్ అయిపోయిన తర్వాతే ఎక్కువగా స్టోరీ సీరియస్ మూడ్ లోకి కూడా వెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించినుంది శ్రీ లీలా. శ్రీ లీలా విషయానికొస్తే పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించలేకపోయింది. ఆ సినిమా సక్సెస్ సాధించక పోయినా కూడా శ్రీ లీల వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

Also Read : IFFI 2024 – Teja Sajja: ఫిలిం ఫెస్టివల్ లో ఊహించని పరిణామం.. షాక్ లో తేజా సజ్జ..!


హీరోయిన్ గా చేస్తున్న తరుణంలో ఐటమ్ సాంగ్ ఏంటి అని చాలామంది ఊహిస్తున్నారు. కానీ శ్రీ లీల ప్లస్ పాయింట్ డాన్స్. ఆమె టాలెంట్ ని ఇదివరకే తెలుగు ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి, తన టాలెంట్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తెలియనుంది. ఇప్పుడే రిలీజ్ అయిన ఈ పాట ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. సుకుమార్ సినిమాకి దేవిశ్రీ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడు అని మరోసారి ప్రూవ్ అయింది అని చెప్పాలి. ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు ఈ పాట మారు మ్రోగడం ఖాయం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×