E-Paper
Advertisement

Devil: డెవిల్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..

Devil: డెవిల్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..
Advertisement

Devil: నందమూరి కళ్యాణ్ రామ్.. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడమే కాకుండా తన వైవిధ్యమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తీసినవి కొన్ని సినిమాలైనా మంచి కాన్సెప్ట్ తో గుర్తుండిపోయే విధంగా తీయడం కళ్యాణ్ రామ్ కి అలవాటు. ఈ నవంబర్ కి తన సరికొత్త చిత్రంతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ మూవీ కు డెవిల్ అనే వెరైటీ టైటిల్ ని పెట్టిన విషయం తెలిసిందే. స్పై థ్రిల్ల‌ర్ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ ఎల్నాజ్ నోరౌజీ ప్రేక్షకులను అలరించబోతోంది.

ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఆమె క్యారెక్టర్ పేరు రోజి అని ఇంట్రడ్యూస్ చేస్తూ.. వింటేజ్ లుక్స్ తో.. ఓ బ్యూటిఫుల్ గోల్డెన్ సీక్వెల్ డ్రెస్ తో మెరిసిపోతున్న ఎల్నాజ్ పిక్చర్ పోస్టర్ ను మరింత క్రేజీగా మార్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చే ఈ మూవీ బ్రిటీష్ కాలం నాటిది అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement

ఇక కళ్యాణ్ రామ్ అప్పటి అంటే బ్రిటిష్ కాలం నాటి లుక్స్ లో కిర్రాక్ ఉన్నాడు. ఇప్పటికే మూవీ టీజర్ చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ బేస్ వాయిస్ లో ఒక సీక్రెట్ ఏజెంట్ కి ఉండాల్సిన లక్షణాలు అంటూ చెప్పే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ అని చెప్పవచ్చు.”మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు.. అదే గూడచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ” అన్న ఒక్క డైలాగ్ స్టోరీ ఎంత డెప్త్ తో ఉంటుందో చెప్పకనే చెబుతుంది.

ఇక రీసెంట్ గా ఈ మూవీలో మాళవిక నాయక్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నోరౌజీ పాత్రను రోజీ అంటూ పరిచయం చేశారు. ఈమె గెటప్ పోస్టర్ లో ఉన్న సెటప్ చూస్తుంటే.. ఏదైనా పాట కోసం అలా ప్రత్యేకమైన కాస్ట్యూమ్ ఇచ్చుండాలి. లేకపోతే అప్పట్లో మంచి బార్ డాన్సర్ అన్నా అయి ఉండాలి అని అనిపిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం ,హిందీ భాషల్లో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ డెవిల్ మూవీలో ఇప్పటివరకు ఎవరికీ అంత చిక్కనటువంటి ఒక రహస్యాన్ని ఛేదించే గూడచారిగా నందమూరి కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×