BigTV English

Jaya Prada: జయప్రద థియేటర్స్ కేసులో కొత్త మలుపు.. తీర్పును కాస్త సడలించిన మద్రాసు హైకోర్టు.

Jaya Prada: జయప్రద థియేటర్స్ కేసులో కొత్త మలుపు.. తీర్పును కాస్త సడలించిన మద్రాసు హైకోర్టు.

Jaya Prada: ఒకప్పటి స్టార్ హీరోయిన్ , మాజీ ఎంపీ..సీనియర్ నటి జయప్రదకు మద్రాసు హైకోర్టు తీర్పుతో కాస్త ఊరట లభించింది. చెన్నైలో జయప్రద పేరు మీద ఉన్న జయప్రద థియేటర్స్ సిబ్బంది కి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) చెల్లించలేదు అనే కారణం చేత ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జయప్రద పై వచ్చిన ఈ తీర్పు సంచలనం సృష్టించింది. కాగా ఈ తీర్పు పై సడలింపు ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ఆమెకు కొంత ఊరట కలిగించింది.


జయప్రద థియేటర్స్ సిబ్బందికి సంబంధించిన ఇన్సూరెన్స్ చెల్లింపుల వ్యవహారంలో నిబంధనలను సరిగా పాటించలేదని, ఉల్లంఘించడం జరిగిందనే విషయం పై జయప్రద తరఫున న్యాయవాది దాఖలు చేసినటువంటి పిటిషన్ కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జయప్రద 15 రోజులలోగా కోర్టుకు లొంగిపోవాలని ఇంకా 20 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాలని జస్టిస్ జీ జయచంద్రన్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఈ కేసులో జయప్రదతో పాటు ఆమె సోదరులు రామ్ కుమార్ ,రాజా బాబు పై విధించినటువంటి శిక్షలో ఎటువంటి మినహాయింపులు ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఇద్దరికీ కోర్టు విధించినటువంటి ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించవలసిందే అని స్పష్టం చేసింది. అయితే కోర్టుకు హాజరు కాని ఈ ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారంటీ కూడా కోర్టు జారీ చేసింది. ఇక జయప్రదకు 20 లక్షల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తే ఆ తరువాత శిక్షకు సంబంధించిన తీర్పును కొట్టివేయడం జరుగుతుంది. తీర్పుకు సంబంధించినటువంటి అన్ని నిబంధనలు సంతృప్తికరంగా ఉంటేనే బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఇవ్వమని దిగువకోర్టుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.


ఇంతకీ విషయం ఏమిటంటే జయప్రద థియేటర్ సంస్థలో జయప్రద తో పాటు రామ్ కుమార్ ,జయప్రద సోదరులు ఇద్దరు భాగస్వాములుగా ఉండేవారు. ఈ నేపథ్యంలో 2005 సంవత్సరంలో ఇన్సూరెన్స్ చెల్లించడం లేదు అని కోర్టులో ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. జీతం నుంచి ఈఎస్ఐ పేరు చెప్పి తీసుకుంటున్న డబ్బులు ఆ ఖాతాలో జమ చేయడం లేదన్న ఆరోపణతో చెన్నై కార్పొరేషన్ థియేటర్ ను సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి సినీ రంగం నుంచి రాజకీయరంగం కి వెళ్ళిన వెంటనే.. అత్యాశకు పోయి జయప్రద ఇలా అనవసరంగా ఇరుక్కుపోయింది అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×