Dhananjay: ప్రముఖ కన్నడ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధనంజయ్ (Dhananjay) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తెలుగులో ‘ పుష్ప ‘ సినిమాలో జాలి రెడ్డిగా నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే తాజాగా తన ప్రియురాలు డాక్టర్ ధన్యత (Dhanyata)తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఆత్మీయులకు, అభిమానులకు ఈ నూతన దంపతులు శిరస్సు వంచి మోకాళ్ళపై పడి మరీ క్షమాపణలు చెప్పారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కర్ణాటకలోని మైసూర్లో బంధుమిత్రులతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆదివారం ఫిబ్రవరి 16వ తేదీన జరిగిన వీరి వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే జనం హాజరవడం జరిగింది. తమ వివాహం పూర్తయిన తర్వాత మీడియా పూర్వకంగా అందరి ఆశీస్సులు తీసుకుంది ఈ కొత్త జంట. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ధనంజయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ..” మా పెళ్ళికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఈ పెళ్లి వేడుకను ఘనంగా జరిపించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పెళ్లికి చాలామంది హాజరయ్యారు. అయితే కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాల్ వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో మిమ్మల్ని తిరిగి కలుస్తాము. పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ ధనంజయ్, ధన్యత వేడుకున్నారు. మొత్తానికి అయితే ఈ జంట చూడముచ్చటగా ఉందని పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ధనంజయ్ కెరియర్..
ధనంజయ్ కెరియర్ విషయానికి వస్తే.. కన్నడ ఫ్యాన్స్ ఈయనను ముద్దుగా డాలీ అని పిలుస్తారు. కన్నడ సినిమాలలో ఈయన నటనను చూసిన డైరెక్టర్ సుకుమార్ (Sukumar ) పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్ర ఇచ్చారు. దీంతో తనదైన స్లాంగ్ తో అందరిని ఆకట్టుకున్నారు.అలాగే పుష్ప 2 సినిమాలో కూడా నటించారు. ధనంజయ్ ప్రస్తుతం ఉత్తరకాండ అనే కన్నడ సినిమాలో నటిస్తున్నారు. ఈయన నటుడు మాత్రమే కాదు మంచి పాటల రచయిత కూడా.. కన్నడలో దాదాపు పది పాటలకు పైగా రాశాడు.
ధన్యత కెరియర్..
ఇక ధనుంజయ్ భార్య ధన్యత విషయానికి వస్తే.. ఈమె చిత్రదుర్గ ప్రాంతానికి చెందినవారు. వృత్తిరీత్యా డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు .స్నేహంతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి , ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. ఏది ఏమైనా ఈ కొత్త జంటను చూసి పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే జాలి రెడ్డి కాస్త కొత్త బంధంలోకి అడుగు పెట్టారు. ఇక త్వరలోనే ఆ శుభవార్త కూడా చెప్పాలని అప్పుడే అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం . మరి ధన్యత గైనకాలజిస్ట్ కాబట్టి ఆమెకు ఎప్పుడూ ఏ పని చేయాలో బాగా తెలుసని కూడా కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.