KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో బీఆర్ఎస్ పై కావాలనే వ్యతిరేక ప్రచారం చేశారని అన్నారు. అందుకే పార్టీలో నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఫైరయ్యారు.
ALSO READ: Kumari Aunty: సీఎం రేవంత్ రెడ్డిని పూజిస్తున్న కుమారీ ఆంటీ.. ఇంటిలోని దేవుడి గుడిలో..
ఇక నుంచి, ఏడాది పొడువున సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్య నమోదు ఇంఛార్జీగా హరీష్ రావును నియమించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఉంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ‘పోరాడి సాధించిన తెలంగాణ మళ్లీ వెనక్కి పొతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలి. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాడాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. ఇక కాంగ్రెస్ లేవడం కష్టం. రాష్ట్రంలో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Indian Navy Recruitment: శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవిలో ఉద్యోగాలు.. వారం రోజులే ఛాన్స్
అంతకుముందు, తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోగానే పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేడర్ తోపులాటతో అసహనానికి గురైన కేసీఆర్ ఒర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుని మాట్లాడారు.
ALSO READ: NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్ భయ్యా.. మంచి వేతనం..
తెలంగాణ భవన్ లో జరిగిన ఈ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ ను సన్నద్ధం చేసేలా కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో చేసిన పోరాటాలపై సమీక్ష, భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 10న జరగబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. హైదరాబాద్ లేదా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా సత్తాచాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. పోరాడి సాధించిన తెలంగాణ మళ్లీ వెనక్కి పొతుందని.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.