Sanam Shetty: గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు భద్రత లేదు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇక్కడ ఆడవారిని కేవలం ఆటబొమ్మగానే చూస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్.. అవకాశం ఆశచూపి.. తన కోరికలను తీర్చుకోవడం. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది వాటన్నంటిని దాటుకొని వచ్చినవారే. ఒకప్పుడు నటీమణులు.. అవకాశాల కోసం కొందరు.. కెరీర్ ను నాశనం చేస్తారేమో అని ఇంకొందరు కొంతమందికి లొంగిపోయి కెరీర్ ను నెట్టుకొచ్చారు. కానీ, ఇప్పుడు అలా లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనగానే సోషల్ మీడియాలో వారి పేర్లతో సహా బయటపెట్టి.. బజారుకు లాగుతున్నారు.
ఇక నటి సనంశెట్టి తాజాగా ఇండస్ట్రీలో సమానత్వం లేదని మీడియా ముందే బహిరంగంగా మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది. సనంశెట్టి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసినా అంతగా గుర్తింపును సంపాదించుకోలేకపోయింది. ఇక అమ్మడిని గుర్తుపట్టాలంటే.. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా గుర్తుందిగా. అందులో మహేష్ కోసం అతని తండ్రి జగపతిబాబు ఒక అమ్మాయిని చూస్తాడు. వారిద్దరి మధ్య పెళ్లి చూపులు జరుగుతాయి. హా.. ఆ పెళ్లి చూపులకు అటెండ్ అయిన రిచ్ గర్ల్ నే సనంశెట్టి. ఈ సినిమాలో చిన్న పాత్ర చేసినా ఈ చిన్నదానికి మంచి గుర్తింపునే వచ్చింది.
Suzhal 2 Trailer: ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ రిలీజ్.. ఈసారి అంతకు మించి
తమిళ్ లో అంబులి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సనంశెట్టి బిగ్ బాస్ 4 తమిళంలో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ ఒక సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యింది. పూజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మిస్తున్న బ్యాడ్ గర్ల్ సినిమాపై విమర్శలు గుప్పించింది. అంజలి శివరామన్, శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వర్ష భారత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యనే రిలీజ్ అయిన బ్యాడ్ గర్ల్ టీజర్ వివాదంలో చిక్కుకుంది. ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చూపించడం ఏంటి అని వీనెటిజన్స్ దుమ్మెత్తిపోశారు.
తాజాగా సనంశెట్టి సైతం బ్యాడ్ గర్ల్ సినిమాపై విమర్శలు గుప్పించింది. బ్యాడ్ గర్ల్ టీజర్ బోల్డ్ కాదు చెత్త. లింగ సమానత్వాన్ని, స్వేచ్ఛను తప్పుగా చూపించారు. చాలాచెత్తగా చూపించారు. ఒక అమ్మాయి సిగరెట్ తాగడం, మందు కొట్టడం.. అబ్బాయితో పోటీపడి ఇవన్నీ చేయడం సమానత్వం అనిపించుకోదు. అవకాశాలలోనూ, మర్యాదలోనూ సమానత్వం ఉండాలి.
ఒక హీరోకు ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఉండే గౌరవం.. ఒక హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఎందుకు ఉండదు. హీరోలు వస్తే లేచి నిలబడే మేకర్స్.. హీరోయిన్స్ వస్తే ఎందుకు ఉండదు. ఇదంతా పక్కన పెడితే.. ఒక హీరోను ఒక సినిమా కోసం సంప్రదించే విధానం.. హీరోయిన్ల విషయంలో ఎందుకు ఉండదు. నన్నే తీసుకోండి.. నాకు ఛాన్స్ లు ఇస్తామని చెప్పే వారికన్నా.. రాత్రుళ్లు రూమ్ లో పడుకోవడానికి రమ్మనేవారే ఎక్కువ. క్యాస్టింగ్ కౌచ్ లేకుండా అవకాశాలు ఇవ్వడం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.