E-Paper
Advertisement

Raayan First Single: ప్రాణం పోతున్నా.. వస్తున్నా.. పొగరు వీడడు వీడే..!

Raayan First Single: ప్రాణం పోతున్నా.. వస్తున్నా.. పొగరు వీడడు వీడే..!
Advertisement

Hero Dhanush ‘Raayan’ First Single: కెప్టెన్ మిల్లర్ తో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఈ సినిమా తరువాత ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. ఆయనే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ సరసన అపర్ణ బాలమురళి నటిస్తుండగా.. SJ సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషార విజయన్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా రాయన్ నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తలవంచి ఎరుగడే.. తలపడితే వదలడే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరో క్యారెక్టర్ ను లిరిక్స్ ద్వారా స్పష్టంగా చూపించారు. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ తెలుగు లిరిక్స్ అందించగా.. మరో ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ సంగీతం అందించాడు. తమిళ్ లో ధనుష్ నే లిరిక్స్ అందించి సాంగ్ కూడా పాడాడు. తెలుగులో  హేమచంద్ర తన వాయిస్ తో సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. రావణాసుడును.. రాయన్ ను చూపిస్తూ .. అతనిలోని గుణగణాలను చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read: OMG Movie Teaser: భయపెట్టడానికి హీరోయిన్ తో కలిసివస్తున్న స్టార్ కమెడియన్..

ప్రాణం పోతున్నా.. వస్తున్నా.. పొగరు వీడడు వీడే. దూరం వెళ్ళండి వెళ్ళండి.. వచ్చాడంటే వీడే భోగిలా కాల్చేస్తాడు అంటూ సాయిగిన లిరిక్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ధనుష్ లుక్ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. కెప్టెన్ మిల్లర్ లో లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపించిన ధనుష్.. ఇందులో గుండుతో కనిపించాడు. మొత్తానికి మొదటి సాంగ్ తోనే సినిమాపై హైప్ తెచ్చాడు. జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×