BigTV English

Dhanush : ధ‌నుష్‌.. మ‌రో టాలీవుడ్ ప్రాజెక్ట్‌!

Dhanush : ధ‌నుష్‌.. మ‌రో టాలీవుడ్ ప్రాజెక్ట్‌!

Dhanush : కోలీవుడ్ నేటి త‌రం విల‌క్ష‌ణ న‌టుడు ధ‌నుష్‌. వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో త‌మిళంలోనే కాదు. తెలుగు, హిందీ భాష‌ల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపును ఆయ‌న సంపాదించుకున్నారు. ఒక‌ప్పుడు త‌మిళంలో లేదా హిందీలోనూ సినిమాలు చేస్తూ వ‌చ్చిన ధ‌నుష్ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్‌పై క‌న్నేశారు. అందులో భాగంగా త‌న క్రేజ్‌, రేంజ్‌ను టాలీవుడ్‌లో మ‌రింత పెంచుకోవ‌టానికి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సార్ (త‌మిళంలో వాత్తి) అనే సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్‌పై శేఖ‌ర్ క‌మ్ముల వ‌ర్క్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.


కాగా తాజా సినీ వ‌ర్గాల టాక్ మేర‌కు ధ‌నుష్ మ‌రో తెలుగు సినిమాను కూడా చేసే అవ‌కాశం ఉంద‌ట‌. వివ‌రాల్లోకి వెళితే నీది నాది ఒకే క‌థ‌, విరాట ప‌ర్వం వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న వేణు ఊడుగుల డైరెక్ష‌న్‌లో ధ‌నుష్ ఓ సినిమా చేయ‌నున్నారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పైనే సినిమా రూపొంద‌నుంది. ఇటీవ‌లే ధ‌నుష్‌ని క‌లిసి వేణు ఊడుగుల క‌థా చ‌ర్చ‌లు జ‌రిపారు. త్వ‌ర‌లోనే దీనిపై మ‌రింత క్లారిటీ రానుంద‌నేది బ‌య‌ట చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం. ఈ స‌స్పెన్స్‌కు తెర ప‌డాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×