BigTV English

Rashmika Mandanna Controversy : చిక్కులో రష్మిక మందన్న.. కన్నడ పరిశ్రమ ‘బ్యాన్’ విధించనుందా?

Rashmika Mandanna Controversy : చిక్కులో రష్మిక మందన్న.. కన్నడ పరిశ్రమ ‘బ్యాన్’ విధించనుందా?

Rashmika Mandanna Controversy : హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అతి త‌క్కువ కాలంలోనే టాప్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ వివాదంగా మారాయి. ఎంతటి వివాదం అంటే ఏకంగా ఆమెను, ఆమె న‌టించిన సినిమాల‌ను బ్యాన్ చేయాల‌ని క‌న్నడ చిత్ర ప‌రిశ్ర‌మ అడుగులు వేసేంత‌గా. అస‌లేం జ‌రిగింది?. చ‌లాకీగా న‌వ్వుతుండే ర‌ష్మిక మంద‌న్న చేసిన వివాదాస్పద‌మైన వ్యాఖ్య‌లు ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే..


రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక మంద‌న్నను ‘కాంతార’ సినిమాను చూశారా! అని ప్ర‌శ్నించారు. చూడాలి.. కాస్త స‌మ‌యం దొర‌క‌గానే త‌ప్ప‌కుండా చూస్తాను అనే స‌మాధానం చెబితే స‌రిపోయేది. కానీ ఆమె అలా చేయలేదు. స‌మ‌యం దొర‌క‌టం లేదు అంటూ అమ్ముడు చెప్పిన స‌మాధానం నిర్ల‌క్ష్యంగా చెప్పిన‌ట్లు అనిపించింది. క‌న్న‌డ సినిమా స్థాయిని కె.జి.య‌ఫ్ త‌ర్వాత కాంతార మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. ఆ సినిమా గురించి క‌న్న‌డ సినిమా రంగం నుంచి హీరోయిన్‌గా ఎదిగిన అమ్మాయి అలా మాట్లాడ‌టంపై క‌న్న‌డ సినీ అభిమానులు, నెటిజ‌న్స్ ఫైర్ అయ్యారు.

దీంతో పాటు ఆమె త‌న తొలి సినిమా గురించి కూడా త‌క్కువ చేసి మాట్లాడింద‌ని సినీ ల‌వ‌ర్స్ గుర్రుగా ఉన్నారు. త‌న‌కు తొలి సినిమా అవ‌కాశం అంత సుల‌భంగా రాలేద‌ని, మోడ‌లింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ మ్యాగ‌జైన్‌పై ఫొటోను చూసి ఎంపిక చేశారంటూ చెప్పింది. ఆ సినిమాకు రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌కుడు కాగా. హీరో రక్షిత్ శెట్టితో త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న ప్రేమ‌లో ప‌డింది. ఎంగేజ్‌మెంట్ వ‌ర‌కు వెళ్లి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. తొలి నిర్మాణ సంస్థ గురించి కూడా ర‌ష్మిక ప‌ట్టించుకోక‌పోవ‌టంపై నెటిజ‌న్స్ కామెంట్స్ రూపంలో నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.


మ‌రో వైపు ర‌ష్మిక మంద‌న్న పేరు ఎత్త‌కుండానే ఆమెను ఇమిటేట్ చేసిన రిష‌బ్ శెట్టి.. అలాంటి హీరోయిన్స్‌తో న‌టించ‌టం త‌న‌కు అస్స‌లు ఇష్టం ఉండ‌ద‌ని కూడా తెలిపారు. ఇవ‌న్నీ ఓ వైపు ఉంటే.. క‌న్న‌డ సినిమా స్థాయి క్ర‌మంగా పెరుగుతుంటే … దానిపై ర‌ష్మిక చేసిన కామెంట్స్ నెగిటివ్‌గా స్ప్రెడ్ కావ‌టంతో ఆమెను బ్యాన్ చేయ‌టానికి క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ ఆలోచిస్తుంద‌ని స‌మాచారం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×