BigTV English

Raayan OTT: ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ ‘రాయన్’.. ఎందులో అంటే..?

Raayan OTT: ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ ‘రాయన్’.. ఎందులో అంటే..?

Raayan OTT: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా హాలీవుడ్‌ సినిమాలో కూడా నటించి అదరగొట్టేశాడు. దీంతో గ్లోబల్ స్టార్‌గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ధనుష్ మూవీ వస్తుందంటే చాలు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో సందడే సందడి. థియేటర్ల వద్ద టపాసులు, డప్పు చప్పుల్లతో హంగామా మామూలుగా ఉండదు.


అయితే హీరోగానే కాకుండా దర్శకత్వంలోనూ తన సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా తీశాడు. అదే ‘రాయన్’. ఈ సినిమాలో అతడు హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నాడు. ఇది ధనుష్ కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కింది. ఇందులో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్‌జే సూర్య, కాళిదాస్ జయరామ్, ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, సెల్వరాఘవన్ వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Also Read: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్, సూర్య నటన హైలైట్?


సన్‌పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. కాగా ఈ సినిమా ఇవాళ అంటే జూలై 26న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాలో ధనుష్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. అయితే కథ కొత్త కాకపోవడంతో మిక్స్‌డ్ టాక్ అందుకుంటుంది. అలాగే ఇందులో ధనుష్ అండ్ ఎస్ జే సూర్య యాక్టింగ్ అదరగొట్టేశారు. అలాగే సందీప్ కిషన్, దుషారాతో పాటు ఇతర నటీ నటులు కూడా తమ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. దర్శకత్వం పరంగా ధనుష్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అలాగే టెక్నికల్ పరంగా కూడా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. కాగా ఈ సినిమా తెలుగులో దాదాపు 550 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక థియేటర్లలో మిక్స్డ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ డీల్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు సన్‌నెక్స్ట్, నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ అప్డేట్‌ వచ్చే అవకాశం ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×