BigTV English

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి

Four die after inhaling suspected poisonous gas in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదకర వాయువు పీల్చి నలుగురు మృతి చెందారు. కట్నీలో ఓ బావిలో మరమ్మతులు చేసేందుకు దిగిన ఓ వ్యక్తితోపాటు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


జుహ్లా-జుహ్లా గ్రామంలో రామ్ భయ్యా దూబే(36) నీటి పంపు అమర్చేందుకు బావిలోకి దిగాడు. అయితే కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతనిని కాపాడేందుకు అతని మేనల్లుడు నీటిలోకి ప్రవేశించాడు. అతను కూడా పైకి రాకపోవడంతో మరో ముగ్గురు నీటిలోకి దిగారు.

రాజేస్ కుస్వాహా(30), ఓ కూలీ, పింటూ కుష్వాహాలు నీటిలోకి దిగారు. అందరూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


కలెక్టర్ దిలీప్ యాదవ్ తోపాటు పోలీస్ సూపరింటెండెంట్ అభిజీత్ రంజన్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామస్తులను అప్రమత్తం చేశారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×