BigTV English

Dhanush: అజిత్ దెబ్బకు ఆరు నెలలు వెనక్కి వెళ్లిన ధనుష్!

Dhanush: అజిత్ దెబ్బకు ఆరు నెలలు వెనక్కి వెళ్లిన ధనుష్!

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రతి భాషలోను సినిమాలు చేస్తున్నాడు. ధనుష్ ప్రస్తుత ప్రాజెక్టుల్లో కుబేర (Kubera) సినిమా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్‌లో ‘తేరీ ఇష్క్ మే’ అనే ఒక రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇక ధనుష్ హీరోగానే కాకుండా.. దర్శకుడిగాను రానిస్తున్నాడు. గతంలో “ప పాండి”, ఇటీవల “రాయన్” చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అలాగే.. రీసెంట్‌గా ధనుష్ మేనల్లుడిని పరిచయం చేస్తూ వచ్చిన ‘నీక్’ సినిమా తర్వాత.. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో “ఇడ్లీ కడాయ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. తాజాగా ఈ సినిమాను ఆరు నెలలు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాడు ధనుష్. అందుకు అజిత్ సినిమా రేసులో ఉండడమే అనుకుంటే.. అసలు కారణం వేరే ఉందని ప్రకటించాడు ధనుష్.


అదే రోజు అజిత్ సినిమా?

ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీ కడాయ్’ (Idly Kadai) చిత్రాన్ని.. మొదట ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేశారు. కానీ అదే రోజు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) రాబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. దీంతో.. అజిత్ వర్సెస్ ధనుష్ బాక్సాఫీస్ ఫిక్స్ అయిందని అనుకున్నారు. దీంతో.. తమిళ సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పుడు ఇడ్లీ కడాయ్ ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాడు ధనుష్. ఆరు నెలలు వెనక్కి వెళ్లి అక్టోబర్ 1, 2025న ఇడ్వీ కడాయ్ కొత్త విడుదల తేదీగా ప్రకటించారు. ఈ విషయాన్ని ధనుష్ మరియు చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ వాయిదా వార్తతో ధనుష్ అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ, సినిమా నాణ్యత కోసం తీసుకున్న నిర్ణయంగా భావిస్తూ సానుకూలంగా స్పందిస్తున్నారు.


‘ఇడ్లీ కడాయ్’ వాయిదా కారణాలు!

‘ఇడ్లీ కడాయ్’ వాయిదా పడడానికి కారణం.. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. విదేశాల్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందట. అలాగే ధనుష్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం.. ఇడ్లీ కడాయ్ వాయిదాకు ఓ కారణం చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ధనుష్‌తో పాటు నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, అరుణ్ విజయ్, షాలినీ పాండే, సముద్రఖని, రాజ్ కిరణ్, మరియు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా, ధనుష్ తన నటనా మరియు దర్శకత్వ ప్రతిభతో భాషలకు అతీతంగా సినీ పరిశ్రమలో సందడి చేస్తున్నాడు. దీంతో.. “ఇడ్లీ కడాయ్” కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×