Panchayat 4: ఈరోజుల్లో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. వెబ్ సిరీస్‌లకు కూడా అదే రేంజ్‌లో క్రేజ్ ఉంది. ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ను సినిమాల కంటే ఎక్కువగా సిరీస్‌లే ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఒక సిరీస్ హిట్ అవ్వగానే వెంటనే ఆ సిరీస్‌కు సీక్వెల్స్ వచ్చేస్తున్నాయి. అలా ఎన్నో సీజన్స్‌తో విడుదలయిన వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘పంచాయత్’ ఒకటి. అయిదేళ్ల క్రితం ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మొదటి సీజన్ విడుదలయ్యింది. ఈ అయిదేళ్లలో ఈ సిరీస్‌కు సంబంధించిన మూడు సీజన్స్ విడుదల కాగా.. తాజాగా నాలుగో సీజన్‌కు సంబంధించిన అప్డేట్ బయటికొచ్చింది.
సూపర్ హిట్ సిరీస్
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీసే ‘పంచాయత్’ (Panchayat). ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2020లో విడుదలయ్యింది. కోవిడ్ సమయంలో భాషతో సంబంధం లేకుండా చాలావరకు సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అదే సమయంలో చాలామందికి వెబ్ సిరీస్‌లు అనేవి కూడా అలవాటు అయ్యాయి. ఒక వెబ్ సిరీస్ చూస్తూ ఎన్ని రోజులు అయినా గడిపేయొచ్చు అనే ఆలోచన ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌లో మొదలయ్యింది. అలాంటి సమయంలో విడుదలయిన హిందీ వెబ్ సిరీసే ‘పంచాయత్’. ఈ సిరీస్ విడుదలయిన కొన్నిరోజుల్లోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకొని సూపర్ హిట్ అయ్యింది.
మరో సీజన్ వచ్చేస్తోంది
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో నేరుగా విడుదలయ్యింది ‘పంచాయత్’. దీనికి సంబంధించి మొదటి సీజన్ విడుదలయ్యి అయిదేళ్లు అయినా ఈ అయిదేళ్లలో దీనికి సంబంధించిన మరో రెండు సీజన్స్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ‘పంచాయత్’ నుండి వచ్చిన ప్రతీ సీజన్.. మునుపటి సీజన్ కంటే హిట్ అవుతుండడంతో దీనిని ఆపాలనే ఆలోచన మేకర్స్‌కు రావడం లేదు. ఇక ప్రేక్షకులు కూడా దీని నుండి వచ్చే ప్రతీ సీజన్‌ను ఆదరిస్తున్నారు. అందుకే ‘పంచాయత్ 4’ కూడా త్వరలోనే ప్రేక్షకులను ఆదరించడానికి వచ్చేస్తోందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది.
Also Read: రీ రిలీజ్‌లతో ఇంత లాభమా.? కొత్త సినిమాల కంటే రీ రిలీజ్‌లే ఎక్కువ..
పార్టీ చేసుకోవాల్సిందే
జులై 2 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ‘పంచాయత్ 4’ (Panchayat 4) స్ట్రీమింగ్ కానుందని ఒక స్పెషల్ పోస్ట్‌తో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మొదటి సీజన్ విడుదలయ్యి అయిదేళ్లు కావడంతో ఈ అయిదేళ్లు అయిన సందర్భంగా పార్టీ చేసుకోవాల్సిందే అంటూ కొత్త సీజన్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఇందులో లీడ్ రోల్స్ చేసిన ప్రతీ ఒక్కరూ ఇప్పటికే ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. అభిషేక్ త్రిపాఠి పాత్రలో జితేంద్ర కుమార్ ఈ సిరీస్‌ను నిలబెట్టాడని ఫ్యాన్స్ అంటుంటారు. నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్.. ఇలా ఎందరో నటీనటులు ‘పంచాయత్’ సిరీస్‌లో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫులేరా అనే గ్రామంలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీసే ‘పంచాయత్’.
#Panchayat Season 4 will premiere on Amazon Prime on July 2nd. pic.twitter.com/T5BOG7d765
— Streaming Updates (@OTTSandeep) April 3, 2025