Big TV Exclusive: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కొత్త సబ్జెక్టుతో సినిమా వచ్చింది అంటే అదే సబ్జెక్టుతో రెండు మూడు సినిమాలు వస్తాయి. అదే తరహాలో సినిమాలు మార్చి మార్చి తీస్తుంటారు కొంతమంది దర్శకులు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా లక్కీ భాస్కర్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు నుంచే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో పలు సందర్భాల్లో నిర్మాత నాగ వంశీ చెబుతూ వచ్చాడు. ఈ సినిమాతోనే దుల్కర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి ఈ సినిమాను డీల్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సార్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి సినిమాలు తీసే విధానం కూడా కంప్లీట్ గా మారిపోయింది.
అదే తరహాలో కుబేర
దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. డాలర్ డ్రీమ్స్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శేఖర్, ఆనంద్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే ఈ సినిమా చూసిన చాలామంది బీటెక్ జాయిన్ అయిపోయారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న శేఖర్ ఇప్పుడు ధనుష్ హీరోగా కుబేర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా షేర్ మార్కెట్ నేపథ్యంలో జరుగుతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. స్వతహాగా శేఖర్ కమ్ముల ఉన్నత చదువులు చదవడం వలన ఇలాంటి స్టోరీలు ఎలా డీల్ చేస్తాడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ అట్లూరి మాత్రం అందరికీ అర్థమయ్యేలా ఈ కథను డీల్ చేశాడు.
ఈ సినిమా నిడివి ఎంత అంటే.?
ఇక ఈ సినిమా విషయానికి వస్తే దాదాపు మూడు గంటల పది నిమిషాలు డ్యూరేషన్ ఉంటుందని తెలుస్తుంది. అయితే దీనిలో దాదాపు 15 నిమిషాల పాటు ట్రిమ్ చేయనున్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది. సినిమాకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఈ సినిమాలో మరో 15 నిమిషాలు తర్వాత యాడ్ చేస్తారు. అయితే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ క్యూరియాసిటీని పెంచుతుంది. ముఖ్యంగా రెండు గెటప్పుల్లోను ధనుష్ కనిపించిన విధానం కొద్దిపాటి ఆసక్తిని రేకెత్తిస్తుంది. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.
Also Read : Mani Ratnam: మరో రామ్ గోపాల్ వర్మ అవ్వకముందే రిటైర్ ఇచ్చేయండి గురు