Suma Adda: బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సుమ కనకాల(Suma Kanakala) ఒకరు. కార్యక్రమం ఏదైనా తన అద్భుతమైన మాట తీరుతో ఎంతో చాకచక్యంగా మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకునే సుమ ఇటీవల కాలంలో కెరియర్ పరంగా చాలా బిజీ అవుతున్నారు . ఒకప్పుడు సుమా లేకుండా టీవీ కార్యక్రమాలు వచ్చేవి కాదు ప్రతి ఒక్క టీవీ షోలో కూడా ఈమె ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసేది. అయితే ఇటీవల సుమ బుల్లితెర కార్యక్రమాలను చాలా వరకు తగ్గించారు. ప్రస్తుతం సుమ సినిమా వేడుకలు అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఏదైనా ఒక కొత్త సినిమా రాబోతుంది అంటే టీజర్ నుంచి మొదలుకొని ఆ సినిమా సక్సెస్ ఈవెంట్ వరకు సుమా ముందు ఉండి నడిపిస్తుంటారు..
అనగనగా చిత్ర బృందం..
ఇక ఇండస్ట్రీలో యాంకర్ గా సుమకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అంటే ఈమె డేట్స్ తెలుసుకొని మరి తమ సినిమా ఈవెంట్స్ పెట్టుకుంటున్నారు అంటే సుమ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. ఇలా సినిమా ఈవెంట్లు మాత్రమే కాకుండా ఈ టీవీలో ప్రసారమయ్యే సుమా అడ్డ(Suma Adda) అనే కార్యక్రమానికి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలెబ్రేటీలు వారి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పాల్గొని సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఈ కార్యక్రమానికి సుమంత్ (Sumanth)హీరోగా నటించి అనగనగా (Anaganaga)చిత్ర బృందం హాజరై సందడి చేశారు.
నవ్వులు పూయించిన సుమ…
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన చిన్నారులతో పాటు సుమంత్, నటుడు రాకేష్ నటి కాజల్ వంటి వాళ్లు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే సుమ అందరితో మాట్లాడుతూ వారిని నవ్వించడమే కాకుండా వారిపై తనదైన శైలిలోనే సెటైర్లు వేశారు. ఇక ఈ కార్యక్రమం ఎంతో సరదా సరదాగా సాగిపోయిందని చెప్పాలి. ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాకేష్ ను సుమ కొన్ని ప్రశ్నలు వేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే దానిని తెలుగులో చెప్పమని చెబుతుంది. కానీ హీరోయిన్ చాలా ఫాస్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడటంతో అర్థం కాని రాకేష్ సుమ చాలా బాగుందని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు. అదేవిధంగా రాకేష్ సుమ ప్రశ్నిస్తూ నీకు కనుక రష్మిక, శ్రీ లీల ఈ ఇద్దరి హీరోయిన్లతో నటించే అవకాశం వస్తే నువ్వు ఎవరితో నటిస్తావు అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రాకేష్ చాలా సీరియస్ గా నేను ఇద్దరితో నటించను అంటూ సమాధానం ఇచ్చాడు.. వెంటనే సుమ మాట్లాడుతూ.. వాళ్లు నిజంగానే మీతో నటించడం లేదు అంటూ వెంటనే తనదైన శైలిలో పంచ్ వేసింది. ఇలా సరదా సరదాగా ఈ ప్రోమో సాగిపోయిందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈ ఆదివారం సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఇక అనగనగా సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారమైన విషయం తెలిసిందే.