BigTV English
Advertisement

Prabhas : కోమాలో ప్రభాస్ అంటూ తప్పుడు ప్రచారం… ఫైర్ అయిన డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas : కోమాలో ప్రభాస్ అంటూ తప్పుడు ప్రచారం… ఫైర్ అయిన డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas ..రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ను పెంచేసుకున్న ఈయన.. ఆ తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ మరింత ఇమేజ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా హిట్ , ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘రాజాసాబ్’ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ సినిమా షూటింగ్స్ కూడా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రభాస్. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో ప్రభాస్ అభిమానులు మండిపడ్డారు.


ప్రభాస్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. రంగంలోకి ఫ్యాన్స్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక యూట్యూబ్ ఛానల్ వారు.. ప్రభాస్ మెట్ల పై నుండి జారీ కింద పడ్డారని, మోకాలికి గాయం అయిందని సర్జరీ కూడా జరిగిందని కొన్ని వార్తలు రాయగా.. ఆ లోపే ఆయన తీవ్రంగా గాయాలవడంతో.. కోమాలోకి వెళ్లిపోయారు అంటూ.. అభిమానులు సైతం భయభ్రాంతులకు లోనయ్యేలా తప్పుడు వార్తలు ప్రచారం చేసారు. అయితే ఈ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో వెంటనే ప్రభాస్ టీమ్ స్పందించి, ఇవన్నీ తప్పుడు వార్తలు, వీటన్నింటిని నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మండిపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ సదరు యూట్యూబ్ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై గొడవకు దిగిన ప్రభాస్ అభిమానులు.. గొడవ తీవ్రతరం కావడంతో విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇక దీంతో ప్రభాస్ అభిమానులు పోలీసులకు సదరు యూట్యూబ్ ఛానల్ పై కేసు ఫైల్ చేయించారు.ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తమ అభిమాన హీరో గురించి తప్పుడు వ్యాఖ్యలు రాస్తూ వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఫలితంగా అభిమానులు మరింత దిగ్భ్రాంతికి లోనవుతున్నారని, ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభాస్ అభిమానులు కోరారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ యూట్యూబ్ ఛానల్ పై కేసు కూడా నమోదు అయింది.


ALSO READ:Radhika Sarath Kumar: సర్జరీ చేయించుకున్న రాధిక..!

ప్రభాస్ కెరియర్..

ప్రభాస్ సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరోగా పేరు దక్కించుకున్న ఈయన.. అన్నీ వందల కోట్ల బడ్జెట్ చిత్రాలు చేస్తూ ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో సక్సెస్ చూసిన ప్రభాస్.. వ్యక్తిగతంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోవడంతో అభిమానులు సైతం హర్ట్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇదిగో అదిగో అంటూ దాదాపు నాలుగు పదుల వయసు కూడా దాటిపోయింది. ఇక ఇప్పటికి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. ప్రభాస్ మాత్రం వరుస సినిమాలు ప్రకటిస్తూ.. పెళ్లి విషయాన్ని దాటవేస్తూ అభిమానులకు నిరాశ మిగులుస్తున్నారు. మరి ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడతారేమో చూడాలి.

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×