BigTV English

Pushpa 2 : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు… బన్నీకి జైలు శిక్ష తప్పదా?

Pushpa 2 : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు… బన్నీకి జైలు శిక్ష తప్పదా?

Pushpa 2 : మోస్ట్ హైప్డ్ మూవీ ‘పుష్ప 2’ రిలీజై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. అయితే ఈ సినిమాను వివాదాలు కూడా అదే స్థాయిలో చుట్టుపడుతున్నాయి. రిలీజ్ కు ముందే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న పుష్ప రాజ్ ను రిలీజ్ అయ్యాక కూడా లేనిపోని తలనొప్పులు చుట్టుముడుతున్నాయి. రీసెంట్ గా ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన గందరగోళం అందరికీ తెలిసిందే. బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు కాగా, అందులో అల్లు అర్జున్ పేరు కూడా మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై నమోదైన సెక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఎలాంటి శిక్ష పడబోతుంది? అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


‘పుష్ప 2’ (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా అభిమనులతో కలిసి సినిమాను చూడాలనుకున్నారు అల్లు అర్జున్. ఆయన అక్కడికి రావడంతో అల్లు అర్జున్ ను చూడడానికి జనాలు ఎగబడగా, తోపులాట చోటు చేసుకున్న ఘటన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద జరిగింది. ఈ షాకింగ్ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వచ్చిన రేవతి తొక్కిసలాట కారణంగా చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పైగా ఆమె కొడుకు ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ ఫ్యామిలీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. పోలీసులు సెక్షన్ 105, 118(1), 3 (5) క్రింద రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. నమోదైన సెక్షన్లను దృష్టిలో పెట్టుకొని చూస్తే అల్లు అర్జున్ కు పడబోయే శిక్ష ఏంటి అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అందులోనూ బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం చూస్తే… హత్యకానీ, ప్రాణనష్టం కానీ జరిగితే ఈ కేసు పెడతారు. 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది కాబట్టి, ఇలాంటి తరహా కేసుల్లో నేరం రుజువైతే కచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. మరి అల్లు అర్జున్ ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఇదిలా ఉండగా ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ టైంలో అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నారనే విషయం తెలియడంతో అక్కడికి జనాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంధ్య థియేటర్ వద్ద అప్పటికే డీజే ఏర్పాటు చేయడంతో యువత ఎక్కువగా ఉంది. దీంతో పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. లాఠీ చార్జ్ చేయడంతో జనాలు పరుగులు తీయగా, ఆ తొక్కిసలాటలోనే రేవతి, ఆమె కొడుకు నలిగిపోయారు. ఇక ఈ ఘటనపై స్పందిస్తూ హీరో అక్కడికి వస్తున్నాడు అన్న విషయాన్ని తమకు ఎవ్వరూ తెలియజేయలేదని అంటున్నారు పోలీసులు. మరోవైపు ఇందులో హీరో తప్పేమీ లేదని, అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని తెలిసినప్పుడు మినిమం సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఉండాల్సింది అంటూ థియేటర్ యాజమాన్యంపై మండిపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఏదేమైనా ఓ సినిమా కోసం ఇలా నిండు ప్రాణం బలవ్వడం అన్నది మాత్రం బాధాకరమే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×