Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్లో సూర్యకి ఎంత మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో.. అంతకు మించిన ఫ్యాన్స్ తెలుగులో కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. సూర్య నుంచి వచ్చే ప్రతి సినిమా కోసం తమిళ అభిమానులు ఎంతలా ఎదురు చూస్తారో.. తెలుగు అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక గత కొన్నాళ్లుగా సూర్య సినిమా వెండితెరపై వచ్చింది లేదు. ఓటీటీలో మంచి విజయాలను అందుకున్న ఈ హీరో చాలా కాలం తర్వాత కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై అభిమానులు మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి రెండు కారణాలు. ఒకటి ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహించడం అయితే.. రెండోది సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని మేకర్స్ తెలపడం.
Actress Pragya Nagra: టాలీవుడ్ నటి ప్రగ్యా ప్రైవేట్ వీడియో లీక్..
ఇక ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌రాజా, వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సూర్య సరసన దిశాపటానీ నటించింది. ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 14న కంగువ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటినుంచి కూడా సినిమాపై హైప్ ఉండడంతో తెలుగు అభిమానుల సైతం ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అనుకున్నారు.
ఎన్నో అంచనాల మధ్య థియేటర్ కు వెళ్లిన అభిమానులు నిరాశగా బయటకు వచ్చారు. సూర్య నటన అంతా బాగానే ఉన్నా సినిమాలో అసలు కథలేదని, డైరెక్టర్ సినిమాను సరిగ్గా తెరకెక్కించలేదని చెప్పుకొచ్చారు. కంగువ రిలీజ్ కి ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా రూ. 2000 కోట్లు కలెక్షన్స్ రాబడుతుందని చెప్పి మరింత హైప్ క్రియేట్ చేశాడు.. కానీ, ఆయన చెప్పిన్నట్లు రూ. 2000 కోట్లు కాదు కదా అందులో ఒకటవ వంతు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది.
ఇవన్నీ పక్కన పెడితే ఎట్టకేలకు కంగువ ఓటీటీ బాట పట్టింది. ఎప్పటినుంచో కంగువ ఓటీటీపై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ కంగువ ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా అమెజాన్.. కంగువ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 8న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నదని పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే హిందీ వెర్షన్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Naga Chaitanya-Sobhita Wedding: పాల బిందెలో ఉంగరాలట.. ఎవరు గెలిచారో తెలుసా.. ?
ఇక ఈ చిత్రంలో సూర్యకు ధీటుగా అనిమల్ నటుడు బాబీ డియోల్ నటించిన విషయం తెలిసిందే. బాబీకి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో సైతం అతని కోసమే ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు. ఇక ఇప్పుడు హిందీ వర్షన్ ఓటీడీలో రాకపోతే వారు ఫైర్ అయ్యే అవకాశం లేకపోలేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీడీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.