Srikakulam Viral Video: డబ్బులిచ్చి మరీ బెల్ట్ దెబ్బలు.. అసభ్య పదజాల దూషణలు.. ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోపణలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో వెనుక ఉన్న ఉదంతమిది. శ్రీకాకుళంలోని ఆర్మీ కోచింగ్ సెంటర్ లో అభ్యర్థులను అమానుషంగా కొడుతున్నారని, మంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని పలువురు ట్విట్టర్ వేదికగా విన్నవించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.
శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరిట కోచింగ్ సెంటర్ ను బసవ రమణ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి కోచింగ్ కు వచ్చే అభ్యర్థుల వద్ద లక్షల డబ్బులు తీసుకొని కోచింగ్ ఇస్తారని. అలాగే ఎవరైనా డబ్బులు అడిగితే దాడికి దిగుతారని నిర్వాహకుడిపై పలుమార్లు ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలకు తావిచ్చేలా ఓ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా ఈ కోచింగ్ సెంటర్ ఆగడాలను అరికట్టాలని ఏకంగా మంత్రి నారా లోకేష్ కి ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేయడం విశేషం.
అయితే ఈ వీడియో ఏడాదిన్నర క్రితం తీసిన వీడియోగా వెల్లడైంది. ఈ ఘటన ఎప్పుడు జరిగినా, అందులో ఓ యువకుడిని నిర్వాహకుడు రమణ విచక్షణా రహితంగా బెల్ట్ తో కొట్టడం, ఆ దెబ్బలకు యువకుడు కేకలు వేయడం చూడవచ్చు. ఈ వీడియో వైరల్ కావడంతో కోచింగ్ సెంటర్ గురించి పలు ఆరోపణల పర్వం ప్రస్తుతం అధికమైంది. గతంలో అమ్మాయిల గదుల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు కూడా ఈ సెంటర్ పై వినిపించాయి. పోలీసులు కూడా రంగంలోకి దిగి విచారించగా, మా సమ్మతం మేరకు వస్తువుల భద్రత కోసమే కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పినట్లు అక్కడి అమ్మాయిలు చెప్పడం విశేషం.
Also Read: Wonder Temple: ఆ ఆలయం ఓ అద్భుతం.. మీరు తలుచుకుంటే అక్కడికి వెళ్లలేరు.. ఒకవేళ వెళితే?
ఏదిఏమైనా వైరల్ అవుతున్న వీడియో పాతదే అయినప్పటికీ, సదరు నిర్వాహకుడిపై పోలీసులు చర్యలు తీసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. బయట అల్లరి పనులు చేయడంతోనే, నిర్వహకుడి అలా కొట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈ వీడియోపై వైసీపీ రెస్పాండ్ అయింది. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రమణ ఏకంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందితే, తప్పక చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు.