BigTV English

Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ కాంబో రిపీట్… మరి అనిల్ రావిపూడితో సినిమా?

Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ కాంబో రిపీట్… మరి అనిల్ రావిపూడితో సినిమా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ‘భోళా శంకర్’ మూవీతో 2023లో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న చిరు… కాస్త గ్యాప్ ఇచ్చి ‘విశ్వంభర’ (Vishwambhara) మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు. అయితే వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తర్వాత చిరు  వరుస సినిమాలను లైన్లో పెడుతున్నట్టు మాత్రం తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ కాంబో రిపీట్ అనే వార్త తాజాగా బయటకు వచ్చింది.


నిజానికి చిరు (Chiranjeevi) ‘విశ్వంభర’ మూవీ తర్వాత పలువురు యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేయబోతున్నారు అంటూ రోజుకో దర్శకుడు పేరు తెరపైకి వస్తుంది. ఇప్పటికే ఈ లిస్టులో శ్రీకాంత్ ఓదెలా, అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ప్రాజెక్ట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఆ తరువాత చిరు మూవీ ఏంటి అంటే… ఇప్పటికైతే మళ్లీ క్వశ్చన్ మార్కే సమాధానం. కానీ చిరు మాత్రం తన అభిమానులను వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే తాజాగా మరో దర్శకుడితో చిరు (Chiranjeevi) నెక్స్ట్ సినిమా చేయబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. అది కూడా తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చిరు కాంబో మరోసారి రిపీట్ కాంబోతోందని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే… ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి సెట్ కాబోతోంది. చిరంజీవి హీరోగా, బాబీ (Bobby Kolli) దర్శకత్వంలో ఇంకో సినిమా తెరపైకి రాబోతుందని వార్త వినిపిస్తోంది టాలీవుడ్ లో. ఇప్పటికే బాబి చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ కాంబో రిపీట్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఇప్పటిదాకా అనిల్ రావిపూడితో చిరు సినిమా అయితే ఫ్రెష్ గా ఉంటుంది అని ఫీల్ అయిన మెగా అభిమానులు ఇప్పుడు మాత్రం అయోమయంలో పడ్డారు.


బాబీతో చిరు (Chiranjeevi) నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు అంటే, మరి అనిల్ రావిపూడి (Anil Ravipudi) సంగతేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అనిల్ రావిపూడి చిరు కోసం కథపై కసరత్తులు మొదలు పెట్టేసారని టాక్. దీంతో మెగాస్టార్ చిరంజీవి వీలైతే ఈ రెండు సినిమాలు ఒకేసారి పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం చిరు ఒకేసారి అనిల్ రావిపూడి, బాబీ సినిమాలను షురూ చేస్తారా? లేదంటే ఒక్కో డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తూ, ఒక దాని తర్వాత ఒక సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతారా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది అన్న మాట తెలిసి మెగా అభిమానులు ఫుల్లుగా ఖుషి అవుతున్నారు. మరి దీనిపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ తో ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×