Jack Movie: సిద్దు జొన్నలగడ్డ.. ఇండస్ట్రీ మీద ప్రేమతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగా మారాడు. ముఖం నిండా మొటిమలు పెట్టుకొని వీడు హీరో ఏంటి.. ? అని ఎన్ని అవమానాలు ఎదురైనా.. టాలెంట్ ఉన్నవాడిని ఎవరు ఆపలేరు అనే నమ్మకంతో ముందు అడుగు వేసి.. తన సినిమాలకు కథలను తానే రాసుకొని హీరోగా మారాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి తమనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు తరువాత మళ్లీ వేలానికి చూసుకోవాల్సిన పరిస్థితి రాదు. సిద్దుకు కూడా వెనక్కి తిరిగి చూసుకొని సినిమా వచ్చింది. అదే డీజే టిల్లు.
సిద్దును కాస్తా స్టార్ బాయ్ ను చేసింది. సిద్దు అంటే తెలియని వారుంటారేమో కానీ, టిల్లుగాడు తెలియని వారుండరు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత సిద్దు రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోగా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా మారాడు. ప్రస్తుతం సిద్దు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి జాక్.. కొంచెం క్రాక్.
Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ కాంబో రిపీట్… మరి అనిల్ రావిపూడితో సినిమా?
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సిద్దు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అఖిల్ అక్కినేనికి మొదటి హిట్ ను అందించింది ఆయనే. 2021 లో భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న భాస్కర్.. ఇప్పుడు సిద్దుతో జత కట్టాడు. దీంతో ఈ కాంబోపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పైగానే పూర్తయ్యింది. శరవేగంగా షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే అదే రోజున ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.
Rashmika Mandanna : రష్మిక మందన్నకు వింత వ్యాధి.. వెలుగులోకి భయంకర నిజం..
మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు నెక్స్ట్ లెవెల్ అంచనాలను పెట్టుకున్నారు. అందులో.. ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలో కనిపించడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాతో ఢీ కొట్టడం అంటే మాటలు కాదు. అలాంటింది సిద్దు ఇంత ధైర్యం ఎందుకు చేశాడు.. ? అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ది రాజా సాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని అంటున్నారు. అందుకే సిద్దు అంత ధైర్యం చేశాడని చెప్పుకొస్తున్నారు. మరి రాజా సాబ్ వాయిదా పడిందని ఈ డేట్ ను ఫిక్స్ చేశాడా.. ? లేక రాజాసాబ్ తోనే ఢీ కొడుతున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.