Arjun SonOf Vyjayanthi : ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో జరుగుతుంది. చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నారు. మొదట ఈ సినిమాను చెప్పినప్పుడు విజయశాంతి చేయడానికి ఒప్పుకోలేదు తర్వాత ఆమె చెప్పిన కొన్ని మార్పులు వలన ఆమె ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమా కోసం నాలుగు నెలలు టైం తీసుకుని ఆరు నుంచి 10 కేజీల వరకు ఆవిడ వెయిట్ కూడా తగ్గారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను రీసెంట్ గానే నిర్వహించింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్లైమాక్స్ పైన అంచనాలు
ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ ఈవెంట్లో పలు రకాల అంశాల గురించి తెలిపారు. అలానే వార్ 2 సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా చివరి 20 నిమిషాలు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందరూ ఎమోషనల్ అయిపోతారు అంటూ ఒక హైప్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చివరి క్లైమాక్స్ బాగా వచ్చింది అంటూ చర్చలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇంకో అనుమానం కూడా మొదలవుతుంది. దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర (Devara) సినిమా చివరి 4 నిముషాలు అదిరిపోతుంది అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు. సినిమా అంతా చూస్తున్న అభిమానులు అసలు చివర 20 నిమిషాలు ఎలా ఉంటుందో అని క్యూరియాసిటీతో ఎదురు చూశారు కానీ అందరికీ నిరాశ మిగిలింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా అని కొంతమంది సందేహం వ్యక్తపరుస్తున్నారు.
Also Read : Tollywood Heros : వారి మాయలో పడుతున్న స్టార్ హీరోలు.. స్టార్ హీరోల లుక్ పై ఫ్యాన్స్ నిరాశ..
చాలా రోజుల తర్వాత
విజయశాంతి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న లేడీ సూపర్ స్టార్ కంటే కూడా అప్పట్లోనే ఆవిడ లేడీ సూపర్ స్టార్ అని అనిపించుకున్నారు. ఆవిడ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలో మాత్రమే కాకుండా ప్రాముఖ్యత ఉన్న చాలా పాత్రలలో ఆవిడ కనిపించారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అందరికీ సప్రైజ్ కలిగించారు. ఇక అర్జున్ సన్నాఫ్ విజయశాంతి సినిమా లో ఏ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చారో ఏప్రిల్ 18న తెలియనుంది.
Also Read : Nani : కోర్టుతో న్యాయం… ఇక లాభాల కోసం హిట్.. ఏది ఏమైనా నాని మంచి ప్రొడ్యూసర్