Sravanthi Chokkarapu : టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఈమె తన చదువులను పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు. అనంతరం పలు ఛానల్లో యాంకర్ (Anchor) గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా ఇండస్ట్రీలో చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్రవంతికి ఏకంగా బిగ్ బాస్ (Bigg Boss)అవకాశం కూడా వచ్చింది.
పవన్ కళ్యాణ్ వీరాభిమాని..
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఈమెకు మరింత పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ గా స్థిరపడుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న స్రవంతి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ప్రశాంత్ (Prashanth) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు ఆ అబ్బాయి పేరు అఖీరా నందన్ (Akira Nandan) అని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కు స్రవంతి వీరాభిమాని కావడంతో తన కొడుకుకు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడి పేరునే పెట్టుకోవడం విశేషం.
రెండవ పెళ్లి…
ఇలా తన వైవాహిక జీవితంలోనూ, వృత్తిపరమైన జీవితంలోనూ సంతోషంగా కొనసాగుతున్న స్రవంతికి సంబంధించి ఒక షాకింగ్ విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. స్రవంతి ప్రశాంత్ లది మొదటి వివాహం కాదని , రెండవ వివాహం అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి స్రవంతి రెండు పెళ్లిళ్లు చేసుకుందా? అంటూ అభిమానులు షాక్ లో ఉండిపోయారు. మరి ఈమె రెండు పెళ్లిళ్ల విషయంలో ఎంతవరకు నిజం ఉందనే విషయానికి వస్తే… ఈమె రెండు సార్లు పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే కానీ ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకోవడం విశేషం.
ప్రేమ వివాహం…
స్రవంతి – ప్రశాంత్ ప్రేమించుకొని ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లయిన తర్వాత పెద్దలు వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించడంతో మరోసారి పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని స్రవంతి ఏకంగా బిగ్ బాస్ వేదికపై చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఈమె ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుందనే విషయాన్ని తన భర్త ప్రశాంత్ తెలియజేస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇలా ప్రేమించుకుని ఇంట్లో వారికి తెలియకుండా ఒకసారి పెళ్లి చేసుకుని, అలాగే పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. యాంకర్ లాస్య, యాంకర్ శివ జ్యోతి వంటి వారు కూడా ఇదే కోవలోకి వస్తారని చెప్పాలి.