Shiva Jyothi: శివ జ్యోతి (Shiva Jyothi) తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా న్యూస్ రీడర్ గా మంచి ఆదరణ సొంతం చేసుకున్న శివజ్యోతికి బిగ్ బాస్ (Bigg Boss)అవకాశమొచ్చింది ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద ఎత్తున యూట్యూబ్ వీడియోలు చేస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అలాగే పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.. ఇకపోతే తాజాగా శివ జ్యోతి తన భర్త గంగూలితో(Ganguly) కలిసి సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సుమ అడ్డా (Suma Adda) కార్యక్రమానికి వచ్చారు.
ఫన్ క్రియేట్ చేసిన సుమ..
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మరో రెండు బుల్లితెర జంటలు కూడా హాజరయ్యారు. ఇక సుమా హోస్టుగా వ్యవహరిస్తున్నారు అంటే ఆటపాటలతో ఆ కార్యక్రమం కొనసాగుతుందనే సంగతి తెలిసిందే.. ఇక ఈ ప్రోమోలో కూడా ఈ మూడు జంటలతో సుమ ఎప్పటిలాగే సరదాగా ఆటలాడిస్తూ ఫన్ క్రియేట్ చేశారు. అయితే చివరిలో సుమశివ జ్యోతిని ప్రశ్నిస్తూ మీ మీద ఏదైనా అలిగేషన్స్ వస్తే మీరు ఎలా సమాధానం చెబుతారు అంటూ ప్రశ్న వేశారు.
హైదరాబాదులోనే ఉంటా..
ఈ ప్రశ్నకు శివజ్యోతి సమాధానం చెబుతూ ఈ విషయం గురించి నేను కాస్త సీరియస్ గానే చెప్పాలనుకుంటున్నాను అంటూ కొంతమందికి కౌంటర్ ఇస్తూనే ఛాలెంజ్ విసిరారు. వాడు బ్రతకడానికి నాపై లేనిపోని అలిగేషన్స్ వేస్తున్నాడు. నేను హైదరాబాద్లోనే ఉంటాను అంటూ ఈమె మాట్లాడారు. అయితే ఆ మాటలను మనకు వినపడకుండా మ్యూట్ చేశారు.ఇక శివ జ్యోతి మాటలను బట్టి చూస్తుంటే కచ్చితంగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ (Anvesh) గురించి మాట్లాడారని స్పష్టం అవుతుంది. ఇటీవల కాలంలో అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది యూట్యూబర్లపై, సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్ అలిగేషన్స్ చేసిన సంగతి తెలిసిందే.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్..
ఎంతోమంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారని ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు అంటూ ఈయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారందరి లిస్ట్ బయట పెట్టారు. ఇక అందులో శివ జ్యోతి కూడా ఎన్నో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదించింది అంటూ అన్వేష్ ఒక వీడియో చేశారు. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడ స్పందించని శివ జ్యోతి సుమ అడ్డా కార్యక్రమంలో స్పందించారని తెలుస్తోంది. మరి ఈ ఘటన గురించి శివ జ్యోతి ఇంకా ఎలాంటి విషయాలను మాట్లాడారు, ఏంటి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది. ఇలా అందరి గురించి లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు బయటపెట్టి ఆ వీడియోల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారన్న ఉద్దేశంతో శివ జ్యోతి మాట్లాడారని తెలుస్తుంది.