Trivikram : ఈయన సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ప్రతి డైలాగు ప్రేక్షకుడి మనసుకు తాకుతుంది. ఏడిపించాలన్న.. నవ్వించాలన్నా. ఈయన తర్వాతే ఎవరైనా.. డైలాగ్ రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమాకు డైరెక్టర్ గా మారి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలు సక్సెస్ అయితే.. మరికొన్ని సినిమాలు డిజాస్టర్ అయిన కూడా సక్సెస్ టాక్ ని అందుకున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటలతోనే మాయ చేయగల డైరెక్టర్ అందుకే ఆయన ఇండస్ట్రీలో ముద్దుగా మాటలు మాంత్రికుడు అని పిలుస్తారు. అయితే సినిమాల్లోకి రాకముందు ఈయన ఏం చేసేవాడు అన్నది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం ఆయన ఏం చేసేవాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడు..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా కొనసాగుతున్న చాలామంది జీవితాల్లో గతంలో అన్ని కష్టాలని అనుభవించారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో కష్టాలని అనుభవించారని చాలా సందర్భాల్లో బయటపెట్టారు. అయితే ఇండస్ట్రీ వైపు అడుగులు వేయకముందు ఈయన ఏం చేసేవాడో తెలుసుకోవాలని చాలామందికి ఆత్రుతగా ఉంటుంది. నిజానికి ఈయనబీఎస్సీలో న్యూక్లియర్ సైన్స్ చదివిన తర్వాత త్రివిక్రమ్ ప్రముఖ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం వచ్చిందట. కానీ త్రివిక్రమ్ తన తండ్రికి ఉద్యోగం చేయనని సినిమాలోకి వెళ్తానని చెప్పారట. ఉద్యోగం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా త్రివిక్రమ్ మాట వినకపోవడంతో మీ ఇష్టం వచ్చింది చేసుకోండని తన తండ్రి తన నిర్ణయానికే వదిలేసాడట. దాంతో కొద్ది రోజులు లెక్చరర్ గా పని చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ట్యూషన్ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అలా ఒకవైపు తన జీవనాన్ని కడుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేశాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ బయటపెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
త్రివిక్రమ్ సినిమాలు..
ఈయన సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. మాటల రచయితగా కెరియర్ని ప్రారంభించిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో త్రివిక్రమ్ అనేక చిత్రాలు చేశారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ సహా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు అందుకున్నారు.. గతేడాది మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేశారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. దాంతో సినిమా ఒకరకంగా హిట్ అయిందని చెప్పాలి.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు.. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళనాడు అట్లీ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని టాక్. అల్లు అర్జున్ సినిమా అయిపోయి నాతో సినిమా చేసేందుకు ఎలా లేదన్న ఒక ఏడాది పడుతుండటంతో వెంకటేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.