BigTV English

OTT Movie : ఓటీటీలో యాక్షన్ తో దుమ్మురేపుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా… ‘కాంతారా’ హీరో ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా

OTT Movie : ఓటీటీలో యాక్షన్ తో దుమ్మురేపుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా… ‘కాంతారా’ హీరో ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ, ఒకప్పుడు చిన్న ఇండస్ట్రీగానే ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కేజీయఫ్’, ‘కాంతారా’ వంటి సినిమాలతో పాన్ ఇండియా సినిమాలు తీసే స్థాయికి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


జీ 5 (Zee 5) లో

ఈ కన్నడ యాక్షన్ మూవీ పేరు ‘గరుడ గమన వృషభ వాహన’ (Garuda Gamana Vrishabha Vahana). 2021 లో విడుదలైన ఈ సినిమా రాజ్ బి. శెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రాజ్ బి. శెట్టి, రిషబ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైటర్ బుద్ధా ఫిలిమ్స్ బ్యానర్‌పై రవి రాయ్, వచన్ శెట్టి కలసి నిర్మించారు. ఈ సినిమా స్టోరీ మంగళూరు నగరంలో ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. త్రిమూర్తులైన శివ , విష్ణు, బ్రహ్మ లను కూడా ఈ స్టోరీలో యాడ్ చేశారు. ఈ మూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మంగళూరులోని మంగళా దేవి ప్రాంతంలో శివ, హరి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరిద్దరూ వ్యతిరేక స్వభావాలు కలిగి ఉంటారు. శివ దూకుడు స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటే, హరి శాంత స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. వీళ్లిద్దరికి బాల్యం నుండే బలమైన స్నేహ బంధం మొదలవుతుంది. శివ చిన్నప్పుడు ఒక బావిలో గాయపడిన స్థితిలో హరి తల్లికి కనిపిస్తాడు. ఆ స్థితి లో ఉన్న శివను చూసి ఆమె దత్తత తీసుకుంటుంది. అప్పటి నుండి వీరిద్దరూ సోదరుల్లా పెరుగుతారు. వాళ్ళు పెద్దయ్యాక హింసాత్మక స్వభావంతో శివ , వ్యూహాత్మక తెలివితేటలతో హరి మంగళూరులో భయంకరమైన గ్యాంగ్‌ స్టర్లుగా ఎదుగుతారు.

Read Also : ఈ సినిమాను చూస్తే హార్రర్ మూవీ లవర్స్ కు ఎంజాయ్ పండగో… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ అహం, ఆశ, అసూయ వంటి వాటిలో చిక్కుకుంటారు. వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ, స్నేహంలో మనస్పర్ధలు ఇద్దరి మధ్య చీలికను తెస్తాయి. ఈ సమయంలో బ్రహ్మయ్య అనే సున్నితమైన పోలీసు అధికారి, మంగళా దేవికి బదిలీ అయి వస్తాడు. అతను ఈ గ్యాంగ్ హింసను అరికట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని చర్యలు శివ, హరి మధ్య మరింత చిచ్చు పెడతాయి. చివరికి వీళ్ళు గ్యాంగ్‌ స్టర్లుగా జీవిచడం మానుకుంటారా ? శివ, హరిల స్నేహ బంధం ఎలా ఎండ్ అవుతుంది ? పోలీసు అధికారి ఎటువంటి చర్యలు తీసుకుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×