BigTV English
Advertisement

8th Pay Commission : ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులతో.. జీతాలు, పింఛన్లు ఎంత పెరుగుతాయో తెలుసా..

8th Pay Commission : ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులతో.. జీతాలు, పింఛన్లు ఎంత పెరుగుతాయో తెలుసా..

8th Pay Commission : దేశంలో లక్షలాది మంది పింఛనుదారులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న ఎనిమిదో వేతన సంఘానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పెరుగుతాయి. బయట పెరిగిపోతున్న ఖర్చులకు సమానంగా తమ జీతాలు పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న  ఉద్యోగులకు ఎనిమిదో వేతన సంఘం భారీ లబ్ధినే చేకూర్చుతుందని భావిస్తున్నారు. కాగా.. ఈ సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎనిమిదో వేతన సంఘం ద్వారా చేకూరనున్న ప్రయోజనాలు ఏంటి.? ఏఏ వర్గాలకు ఎంత మేరా నెల వారీ జీతభత్యాలు పెరుగుతాయి.? అన్నది ఆసక్తికరంగా మారింది.


ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు వారికి కల్పించే అనేక ప్రయోజనాలు పెద్ద ఎత్తున ప్రభావం కానున్నాయి. అలాగే.. పింఛనుదారులకు నెలవారి అందే సొమ్ముల్లో సైతం పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయి. అలా.. మొత్తంగా ఎనిమిదో వేతన సంఘం ప్రయోజనాలు కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూర్చనుంది. అయితే ఈ పే కమిషన్ ఎంత శాంత ఫిట్ మెంట్ పెంపునకు సిఫార్సు చేయవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

దేశంలోని ప్రముఖ విశ్లేషకులు, ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం.. 2.86 శాతం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో అమల్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే నెలవారీ పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు. గతంలో 2016లో 7వ వేతన సంఘాన్ని నియమించారు. అప్పటి పరిస్థితుల్లో ఇది 2.57 ఫిట్ మెంట్ శాతం పెంచేందుకు సిఫార్సు చేయగా.. కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.దాంతో.. అంతకు ముందు వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే భారీ ఎత్తున పెరిగింది.


ఏడో వేతన సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ చేసిన వారికి ఫించను సైతం భారీగానే పెరిగింది. అంతుకు ముందు చాలా తక్కువగా ఉన్న నెలవారీ ఫించను.. ఒక్కసారిగా  కనిష్ట స్థాయిలో రూ.9 వేలకు చేరుకోగా, గరిష్ట పింఛను నెలకు రూ.1. 25 లక్షలకు చేరింది. గరిష్ట పింఛనుపై పరిమితులు విధించిన వేతన సంఘం.. అప్పటి కేంద్ర సర్వీసు ఉద్యోగుల జీతంలో ఆ పింఛను 50% నికి సమానమని వెల్లడించింది.

ఏనిమిదేళ్ల తర్వాత మరోసారి వేతన సంఘం అమల్లోకి రాగా.. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులు, పింఛనుదారులు గుడ్ న్యూస్ అందుకుంటారని భావిస్తున్నారు. కాగా.. ఎనిమిదవ వేతన సంఘం 2.86 ఫిట్ మెంట్ సిఫార్సు చేసి కేంద్రం ఆమోదిస్తే భారీ ప్రయోజనాలు దక్కనున్నాయి.  ప్రస్తుతం నెలకు రూ. 9,000 లుగా ఉన్న కనిష్ట పెన్షన్.. నెలకు ఏకంగా రూ 25,740కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాక ఇది అంతకు క్రితం మొత్తంతో పోల్చితే 186% పెరుగుదల కావడం విశేషం. అలాగే ప్రస్తుతం రూ.1.25 లక్షలగా ఉన్న గరిష్ట పెన్షన్ ఏకంగా రూ. 3,57,500 చేరుకునే అవకాశం ఉంది.

Also Read : మావోయిస్ట్ అగ్రనేత చలపతిని ఎలా ఎన్‌కౌంటర్ చేశారు.. అతన్ని పట్టించింది ఎవరు..

ప్రస్తుతం బేసిక్ పెన్షన్ లో 53% గా ఉన్న కరవు భత్యం (DR)ప్రయోజనాలు సైతం పెన్షన్ దారులకు భారీ ఊరటను కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా డీఆర్ ను ద్రవ్యోల్భణంతో పోల్చి రెండేళ్లకు ఓసారి సవరిస్తుంటారు. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా పెన్షనర్ల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు. అలా.. ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులతో డీఆర్ ద్వారాను పెద్ద ఎత్తున నెలవారీ సాయం అందనుంది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×