BigTV English

SK 25: శివకార్తికేయన్, సుధా కొంగర మూవీ టైటిల్ ఫిక్స్.. లేడీ పవర్ కనిపిస్తోందిగా.!

SK 25: శివకార్తికేయన్, సుధా కొంగర మూవీ టైటిల్ ఫిక్స్.. లేడీ పవర్ కనిపిస్తోందిగా.!

SK 25: కోలీవుడ్‌లో కేవలం తమ యాక్టింగ్ టాలెంట్‌తోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి వారికి దగ్గరయిన యంగ్ హీరోల్లో శివకార్తికేయన్ ఒకడు. చాలావరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథలు, యాక్టింగ్‌తో ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ‘అమరన్’తో కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్న శివకార్తికేయన్.. దాని తర్వాత లేడీ డైరెక్టర్ అయిన సుధా కొంగర దర్శకత్వంలో యాక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని ఇప్పటికే కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్.


టైటిల్ రివీల్

ఇప్పటికే శివకార్తికేయన్‌కు తమిళంలో భారీ మార్కెట్ ఏర్పడింది. ఏ యంగ్ హీరో కూడా సాధించలేని కలెక్షన్స్‌ను ‘అమరన్’తో సాధించి చూపించాడు ఈ హీరో. ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే తన తరువాతి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇంతలోనే తను సుధా కొంగరతో మూవీ ఓకే చేశాడు అనగానే కచ్చితంగా ఇది తన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యి షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. దీంతో టైటిల్ కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌ను మరింత హ్యాపీ చేశారు.


పవర్‌ఫుల్ టైటిల్

సుధా కొంగర (Sudha Kongara), శివకార్తికేయన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీకి ‘పరాశక్తి’ (Parasakthi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. టైటిల్‌తో అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో టైటిల్‌లోనే లేడీ పవర్ కనిపిస్తోందని, సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ మూవీలో శివకార్తికేయన్‌తో పాటు జయం రవి, అథర్వ మురళి వంటి హీరోలు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొనడంతో ఇందులోని నటీనటులు ఎవరు అనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా బయటికి రాలేదు.

Also Read: సిద్ధు జొన్నలగడ్డపై మనసు పారేసుకున్న ‘బేబి’ బ్యూటీ.. పోస్ట్ వైరల్..

అతడే విలన్

కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘సినిమా షూటింగ్ మొదలయ్యింది. ప్రోమో షూట్ కూడా ముగిసింది. ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా. ఇందులో ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే జయం రవినే. ఆయనను విలన్ అనలేను కానీ దాదాపు అలాంటి పాత్రలోనే కనిపిస్తున్నారు. అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. దానికి ఆయన ఓకే చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఆయనతో కలిసి ఫైట్ చేయబోతున్నాను అనేది చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. సుధా మేడమ్ అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటారు. ఎప్పుడూ ఎనర్జీతో ఉంటారు’’ అని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×