BigTV English

Keya Nair: కల్కిలో అశ్వత్థామతో ఉన్న రాయ.. అబ్బాయి కాదు అమ్మాయి.. ఎంత అందంగా ఉందో చూడండి

Keya Nair: కల్కిలో అశ్వత్థామతో ఉన్న రాయ.. అబ్బాయి కాదు అమ్మాయి.. ఎంత అందంగా ఉందో చూడండి

Keya Nair: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి2898AD. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. సైన్స్ ఫిక్షన్ కు మైథలాజికల్ టచ్ ఇచ్చి.. సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు నాగీ. అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్.. కర్ణుడుగా ప్రభాస్ కనిపించగా.. అర్జునుడుగా విజయ్ దేవరకొండ కనిపించి షాక్ ఇచ్చాడు.


ఇక ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా కూడా వారు ఇప్పుడు స్టార్స్ గా మారారు. ఇక కల్కిలో రాయ అనే క్యారెక్టర్ గుర్తుందిగా.. అదేనండీ.. కాంప్లెక్స్ బౌంటీల నుంచి తప్పించుకొని అశ్వత్థామ ఉన్న గుహకు వెళ్లి.. అతడి మణిని అందిస్తాడు. ఆ కుర్రాడు సినిమాలో కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. అయితే రాయగా నటించింది అబ్బాయి కాదు.. అమ్మాయి.

అవును మీరు వింటుంది నిజమే.. మొదట్లో రాజేంద్రప్రసాద్.. రాయ పక్కన ఉన్న అబ్బాయితో.. మీ అక్కనా అని అడుగుతాడు. కానీ, రాయ షాక్ అయ్యి నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అని చెప్తాడు. కానీ, నిజానికి బయట కూడా ఆమె అమ్మాయే. ఆమె పేరు కేయ నాయర్. తను మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్. అంతకు ముందు ఈ చిన్నది ఏ సినిమాల్లో నటించలేదని తెలుస్తోంది.


కల్కి రిలీజ్ అయిన దగ్గరనుంచి ఆమెకు మంచి గుర్తింపు వస్తుంది. ఈ మధ్య జరిగిన నాగీ బర్త్ డే వేడుకల్లో కూడా ఈ చిన్నారి పాల్గొంది. ఇక కల్కి లో తనకు వచ్చిన గుర్తింపుకు కారణం నాగీ, స్వప్న దత్, ప్రియాంక దత్ కావడంతో వారికి థాంక్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కేయ.. అబ్బాయిగా అందంగా ఉన్నా.. అమ్మాయిగా ఇంకా అందంగా ఉంది. త్వరలోనే ఆమె మంచి సినిమాల్లో కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి తెలుగులో ఈ చిన్నది హీరోయిన్ గా పరిచయం అవుతుందేమో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×