Ananya Nagalla: మల్లేశం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన బ్యూటీ అనన్య నాగళ్ళ. అచ్చ తెలుగందంగా మల్లేశం సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ చిన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. నివేదా థామస్, అంజలితో పాటు అనన్య కూడా ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.
వకీల్ సాబ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి అనన్యకు వకీల్ సాబ్ బ్యూటీ అనే గుర్తింపు వచ్చింది. అయితే నటిగా కొనసాగుతుంది కానీ.. అమ్మడికి మాత్రం హీరోయిన్ గా నిలదొక్కుకునే సినిమాలు రావడం లేదు. ఈ మధ్యనే పొట్టేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయినా.. అనన్యకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
Krish Jagarlamudi: సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్..
ఇక తాజాగా ఈ చిన్నది మెగా మేనల్లుడు సినిమాలో ఛాన్స్ పట్టేసింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం SDT18. విరూపాక్ష తరువాత సంపత్ నందితో గాంజా శంకర్ అనే సినిమాను ప్రకటించాడు తేజ్. కానీ, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయింది. దాన్ని పక్కనపెట్టేసి.. కుర్ర హీరో తేజ్ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. కెపి రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హనుమాన్ లాంటి భారీ విజయాన్ని అందుకున్న కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ నే రంగంలోకి దించారు మేకర్స్. ఇప్పటికే హీరోయిన్ గా కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి ఎంపిక అయ్యింది. విలక్షణ నటులు జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Allu Arjun: చరణ్ ను కాపీ కొడుతున్న బన్నీ..?
ఇక తాజాగా ఈ చిత్రంలో అనన్య కూడా భాగం అయ్యిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నిండుగా చీరకట్టు, బొట్టుతో నవ్వుతూ కనిపిస్తున్న అనన్య పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో అనన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.