Krish Jagarlamudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కాడు. అంటే ఇది మొదటి వివాహం కాదులెండి. రెండోసారి ఈ డైరెక్టర్ పెళ్లి చేసుకున్నాడు. డాక్టర్ ప్రీతి చల్లాను క్రిష్ నేడు రహస్యంగా వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి నేడు క్రిష్ పెళ్లి జరగబోతుందని వార్తలు వచ్చాయి కానీ, ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఇప్పుడు వీరి పెళ్లి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇంకొక విశేషం ఏంటంటే.. నేడు క్రిష్ పుట్టినరోజు కూడా. పుట్టినరోజునే పెళ్లిరోజుగా మార్చుకున్నాడు డైరెక్టర్. క్రిష్ భార్య ప్రీతి ఎంతో అందంగా ఉంది. ఆమె ఒక ప్రవేట్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. గత కొన్నేళ్లగా వీరు రిలేషన్ లో ఉన్నారని సమాచారం.
Allu Arjun: చరణ్ ను కాపీ కొడుతున్న బన్నీ..?
ఇక క్రిష్ కు అంతకుముందే రమ్య వెలగ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. రెండేళ్లు కూడా నిండకుండానే వీరు కొన్ని విభేదాల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న క్రిష్ లైఫ్ లోకి ప్రీతి వచ్చింది. ఇక ప్రీతికి కూడా ఇది రెండో వివాహమని టాక్. ఇక ఈ జంటకు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జాగర్లమూడి రాధాకృష్ణ.. గమ్యం సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. మొదటి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరాడు. ఇక ఈ ఏడాది డ్రగ్స్ కేసు లో కూడా క్రిష్ పేరు వినిపించింది. ఆ డ్రగ్స్ తో తనకేం సంబంధం లేదని క్రిష్ చెప్పుకొచ్చాడు.
Sai Dharam Tej: సింగిల్స్ డే.. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ బ్రో..
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటీ అనే సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్ కోసమే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే ఘాటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పెళ్లి తరువాత క్రిష్ తెరకెక్కించిన ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.