BigTV English

Dil Raju: బడ్జెట్ కాదు కథ ముఖ్యం.. తప్పు తెలుసుకున్న హార్ట్ కింగ్.. ఇంకోసారి అలా చేయనంటూ

Dil Raju: బడ్జెట్ కాదు కథ ముఖ్యం.. తప్పు తెలుసుకున్న హార్ట్ కింగ్.. ఇంకోసారి అలా చేయనంటూ

Dil Raju: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకటి బడ్జెట్ ను నమ్ముకున్న సినిమా అయితే.. ఇంకొకటి కథను నమ్ముకున్న సినిమా. 100 కోట్లకు పైగా ఖర్చు చేసి తీసిన సినిమా గేమ్  ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. శంకర్ సినిమా అంటే బడ్జెట్ అనే చెప్పాలి. అంతకు ముందు ఉన్న శంకర్ వేరు.. ఇప్పుడున్న శంకర్ వేరు.


పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఆయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో ఇప్పటికీ టార్చ్ బేరర్స్ గా ఉన్నాయి. కానీ, ఇప్పుడు శంకర్ తీసిన గేమ్ ఛేంజర్.. ఆ సినిమాలకు దగ్గరలోకి కూడా వెళ్లలేకపోయింది. కథ లేదు.. కథనం లేదు అని ప్రేక్షకులు పెదవి విరిచేశారు. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నా..  నష్టపోయింది మాత్రం దిల్ రాజు మాత్రమే. సరే గుడ్డిలో మెల్లలాగ.. గేమ్ ఛేంజర్  నష్టపోయినా .. ఆ నష్టాలను భర్తీచేయడానికి సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది.

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా జనవరి 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కామెడీ, కథ, విజువల్స్, సాంగ్స్  తో కుటుంబ ప్రేక్షకులను అలరించింది. సంక్రాంతి విన్నర్ గా యునానిమస్ గా గెలిచింది. ఇక ఈ సక్సెస్ తో చిత్ర బృందంతో పాటు హార్ట్ కింగ్ కూడా కొద్దిగా తేరుకున్నాడు. ఇప్పటివరకు సినిమా సక్సెస్ అయితే హీరోలు పార్టీ ఇవ్వడం చూసాం.. నిర్మాత పార్టీ ఇవ్వడం చూసాం. కానీ, మొదటిసారి బయ్యర్లు పార్టీ ఇచ్చారు.


Shilpa Shirodkar: బావ మహేష్‌తో విభేదాలు.. ఎట్టేకలకు నోరు విప్పిన నమ్రత చెల్లి

నేడు బయ్యర్లు ప్రెస్ మీట్ పెట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వలన తమకు వచ్చినలాభాల గురించి మాట్లాడారు. ఇక ఈ వేడుకలో దిల్ రాజు.. తన తప్పు తెలుసుకున్నాడు.  ఏ సినిమాకు  అయినా కథనే ముఖ్యం అని చెప్పుకొచ్చాడు. ” ఒక 72 డేస్ లో సినిమాను డైరెక్టర్ గా అనిల్ డిజైన్ చేసి, వెంకటేష్ లాంటి ఒక సీనియర్ హీరోతో  వాళ్లు ప్లాన్ చేసి.. ఒక బంతిని సిక్స్ కొడితే ఎలా ఉంటుందో నిరూపించారు. బడ్జెట్ ముఖ్యం కాదు  కథ ముఖ్యం. కానీ, ఇది మర్చిపోతూ ఉంటాం. మేము కూడా  ప్రతి సినిమా కథలతోనే మొదలుపెడతాం.

కొత్త  దర్శకులతో సినిమాలు చేసినప్పుడే మా సంస్థకు ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో.. ఎన్ని హిట్స్ వచ్చాయో అందరికీ తెల్సిందే. మేము కూడా అందరిలాగా నాలుగైదు ఏళ్లుగా కాంబినేషన్ సినిమాలు అంటూ వెళ్లాం. అక్కడ తడబడ్డాం. కానీ, మాకు  ఇప్పుడు తెలిసివచ్చింది. లేదు.. మా మూలాలను మాకు గుర్తుచేసి సరైన దారిలో.. రహదారి వేసి ఇచ్చాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దిల్ రాజు మాటలు విన్న నెటిజన్స్.. ఇదేదో ముందే రియలైజ్ అయ్యి ఉంటే కోట్లు మిగిలేవిగా అని కొందరు. డబ్బు పోతే కానీ మూలాలు గుర్తురాలేదా అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×