BigTV English

Shilpa Shirodkar: బావ మహేష్‌తో విభేదాలు.. ఎట్టేకలకు నోరు విప్పిన నమ్రత చెల్లి

Shilpa Shirodkar: బావ మహేష్‌తో విభేదాలు.. ఎట్టేకలకు నోరు విప్పిన నమ్రత చెల్లి

Shilpa Shirodkar:  సోషల్ మీడియా వచ్చాక సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు అన్ని సోషల్ మీడియాలోనే  చర్చలు జరుగుతున్నాయి. సెలబ్రిటీ కపుల్స్ సోషల్ మీడియాలో వరుసగా  పోస్టులు పెడుతున్నారు అంటే వారు కలిసి ఉన్నట్లు..  జంటగా కాకుండా ఒక్కరే కనిపించినా.. కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వారు విడిపోయినట్లే. కుటుంబలో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలు ఉంటే.. ఒకరి పోస్ట్ కు ఒకరు రియాక్ట్ అవ్వకపోయినా.. వారి సినిమాను సపోర్ట్ చేయకపోయినా వారి మధ్య విభేదాలు ఉన్నాయని లెక్క. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు తాము కలిసి ఉన్నామని చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియా లో పోస్టులు పెడుతూ ఉంటారు.


ఇక ఇదంతా పక్కన పెడితే.. గతకొన్ని రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. నమ్రత కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నమ్రత శిరోద్కర్ చెల్లి  శిల్పా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కూడా నటినే. ఇక పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె.. గతేడాది హిందీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లి మరోసారి హైలైట్ అయ్యింది. చివరివరకు గట్టి పోటీనే ఇచ్చినా ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.

Sobhita Akkineni:పెళ్లి పీటల మీదే అల్లు అరవింద్ కు శోభితా రిక్వెస్ట్.. దాన్ని చూడలేకపోతున్నా అంటూ


బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక.. అక్క నమ్రతను కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక చెల్లి శిల్పాతో దిగిన ఫోటోను నమ్రత షేర్ చేస్తూ.. ఆమె తిరిగిరావడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే శిల్పా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మహేష్ తనకు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఒకవేళ అలా పెట్టి ఉంటే తెలుగు ప్రేక్షకులు.. మహేష్ కోసమైనా శిల్పాను సపోర్ట్ చేస్తూ ఓటు వేసేవారు. కానీ, మహేష్ శిల్పా గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో  వీరి మధ్య విభేదాలు ఉన్నాయని పుకార్లు చెలరేగాయి.

తాజాగా  ఈ పుకార్లకు శిల్పా శిరోద్కర్ ఫుల్ స్టాప్ పెట్టింది. ” సోషల్ మీడియా పోస్టుల వలన బంధాలను అంచనా వేయడం పద్దతి కాదు. నేను ఆ హౌస్ లో ఉన్నప్పుడు మహేష్ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, మా మధ్య వివాదాలు ఉన్నాయని ఎలా చెప్తారు. అది  కరెక్ట్ కాదు. పోస్ట్ పెడితేనే సంబంధాలు ఉన్నట్టా.. ?. ఆన్లైన్ లోనే ప్రేమాభిమానాలు చూపించడం మాకు రాదు. మేము అలాంటి మనుషులం కాదు.

నేనేంటో నిరూపించుకోవాలని బిగ్ బాస్ కు వెళ్లాను  కానీ, నమ్రత చెల్లిగానో, మహేష్ మరదలిగానో కాదు. మా బావ  సూపర్ స్టార్. అంతమాత్రానా నా కెరీర్ లో భాగం కాదు కదా. మహేష్- నమ్రత చాలా రివెట్ పర్సన్స్. ఏది పైకి కనిపించాలని చూపించరు. అది చూసి చాలామంది వారికి పొగరు అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. వారిద్దరూ చాలా మంచివారు. సరైన సమయంలో నాకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×