Dil Raju Comments : రెండు తెలుగు రాష్ట్రాలలో గత 15 రోజులుగా అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం థియేటర్ బంద్.. కంటెంట్ లేకపోవడం, థియేటర్లలో పెరిగిన ఖర్చులు, టికెట్ ధర అధికం వంటి పలు కారణాలవల్ల ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి సినిమా చూడడానికి వెనుకడుగు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్ల నుండి సినిమాను కొన్న ఎగ్జిబిటర్లు పూర్తిస్థాయిలో నష్టపోతున్నారు. లీజుకు తీసుకున్న థియేటర్ల రెంట్ కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ బంద్ చేయాలి అని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న వేళ.. అటు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు రంగంలోకి దిగి.. సినిమా థియేటర్ బంద్ చేయడం కుదరదు కానీ త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపెడతామంటూ ఇటీవల ఫిలిం ఛాంబర్ లో ఫిలిం ఛాంబర్ పెద్దలు తెలిపిన విషయం తెలిసిందే.
ఇంటి దొంగను శివుడైన పట్టడేమో..
అయితే జూన్ 1 నుండి జూన్ 27 వరకు స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఆపివేయాలి అని, సినిమా కలెక్షన్స్ కి ఆటంకం కలిగించాలి అని ఒక నలుగురు బడా నిర్మాతలు తెరవెనక కథ నడుపుతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లను దిల్ రాజు(Dilraju ), అల్లు అరవింద్ (Allu Aravindh), ఏషియన్ సునీల్ (Asian Sunil), దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Sureshbabu) శాసించే వాళ్ళు. వీరు చెప్పిందే వేదం గా మిగతా యాజమాన్యం భావించేది. అయితే ఇప్పుడు ఈ నలుగురు వల్లే సినిమా బంద్ అనే విషయం తెరపైకి వచ్చింది అంటూ ఒక గాసిప్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించగా.. ఇందులో తమ హస్తం లేదని.. నిన్న అనగా మే 25న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఆ నలుగురిలో తాను లేను అని, తనకు కేవలం తెలంగాణలో ఒక థియేటర్, అటు ఆంధ్రాలో 15 థియేటర్లు కూడా లేవని, ప్రస్తుతం థియేటర్ బాధ్యతల నుండి తప్పుకున్నాను అని స్పష్టం చేశారు. ఇటు దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి తన హస్తం లేదని చెబుతున్నాడు. దీన్నిబట్టి చూస్తే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడేమో అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తూఫాన్ ను వారి వైపు మళ్లించిన దిల్ రాజు..
మరి ఆ నలుగురు ఎవరు ? అంటూ ప్రశ్న ఎదురవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో తాను కూడా లేను అని ఈ తూఫానును ఆ ఇద్దరిపై తోసేశాడు దిల్ రాజు. ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. “నా దగ్గర ఉంది కేవలం 30 థియేటర్లే. నైజాం మొత్తం మీద సింగిల్ స్క్రీన్స్ 370 ఉంటే.. అందులో నావి 30 మాత్రమే. ఏషియన్ సునీల్ , సురేష్ బాబు దగ్గర కలిపి 90 ఉన్నాయి. మిగతా 250 థియేటర్లు ఓనర్ల దగ్గరే ఉన్నాయి. ఈ విషయాన్ని మీడియా వాళ్ళు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇష్టం వచ్చినట్టు రాయకండి” అంటూ తెలిపారు దిల్ రాజు. మొత్తానికైతే ఇప్పుడు దిల్ రాజు వ్యాఖ్యలతో ఆ నలుగురు కాస్త ఆ ఇద్దరయ్యారు. మరి ఆ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి.
ALSO READ:Nara Rohit: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న నారా రోహిత్.. టూ బ్యాడ్ గురూ..!