Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) నటించిన తాజా మూవీ భైరవం.ఈ సినిమాలో నారా రోహిత్ తో పాటు మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj),నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు(Bellamkonda Suresh Babu), తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ఈ ముగ్గురు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళ్ ‘గరుడన్’ మూవీకి రీమేక్ అని వార్తలు వస్తున్నప్పటికీ.. అలాంటిదేమీ లేదు.. ఆ సినిమాకి భైరవం మూవీ రీమేక్ కాదు అంటూ ఈ హీరోలు చెప్పుకొస్తున్నారు. ఇక విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 30న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఇందులో ముగ్గురు హీరోలు ఉన్నారు.ఈ ముగ్గురు హీరోలకి కచ్చితంగా హిట్ కావాలి. అలా ముగ్గురు హీరోలు భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఈవెంట్లలో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకి భారీ హైప్ పెంచుతున్నారు. అలాగే వారి పర్సనల్ విషయాలతో కూడా సినిమాకి మరింత బూస్ట్ ఇస్తున్నారు. అయితే అలాంటిది తాజాగా నారా రోహిత్ అందరి ముందే స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆయన కన్నీళ్లు చూసి చాలా మంది షాక్ అయిపోయారు. మరి ఇంతకీ నారా రోహిత్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న నారా రోహిత్..
నారా రోహిత్ తాజాగా బైరవం మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్.. అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తేనే సినిమా అనేది అద్భుతంగా వస్తుంది.ఇక ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ కోసమే ఎదురు చూస్తున్నారు.అందులో మనోజ్,సాయి, శ్రీ చరణ్, అదితి, రాధామోహన్, ఆనంది,శ్రీధర్ గారు వీళ్ళందరికీ ఒక మంచి సక్సెస్ కావాలి. ఒక మంచి సక్సెస్ అందిస్తే ఇంకా మీ ముందు ఎన్నో మంచి మంచి సినిమాలు తీసుకురావడానికి ముందుకు వస్తాం. ఈ సినిమాని సక్సెస్ చేయండి అన్నట్లుగా ఆ ఈవెంట్లో మాట్లాడారు. అయితే స్టేజ్ మీద అలా మాట్లాడుతుండగానే నారా రోహిత్ సడన్గా ఎమోషనల్ అయిపోయి కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఈయన ఎమోషనల్ స్పీచ్ కి చాలామంది షాక్ అయిపోతున్నారు.ఇదేంటి నారా రోహిత్ ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు.స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
నారా రోహిత్ కెరియర్..
ఇక నారా రోహిత్ పర్సనల్ విషయానికి వస్తే.. రీసెంట్ గానే ఆయన తండ్రిని కోల్పోయారు.. రోహిత్ ప్రతినిధి-2 మూవీలో నటించిన హీరోయిన్ సిరి లేళ్లతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న తరుణంలో తండ్రి మరణంతో రోహిత్ పెళ్లి వాయిదా పడింది. అలా తండ్రి మరణించినా కూడా షూటింగ్ కి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా భైరవం మూవీ షూటింగ్లో పాల్గొన్నారట నారా రోహిత్.
ALSO READ:Telugu Producers : మీరు కూడా కాకపోతే… మరి ఎవరు సార్ ఆ ‘ఆ నలుగురు’..!